Apple Watch Covid-19: యాపిల్‌ వాచ్‌తో కరోనా లక్షణాలు గుర్తింపు: అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Apple Watch Covid-19: యాపిల్‌ వాచ్‌తో కరోనా లక్షణ గుర్తించవచ్చని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సంప్రదాయంగా నిర్ధారణ పరీక్షల కంటే ...

Apple Watch Covid-19: యాపిల్‌ వాచ్‌తో కరోనా లక్షణాలు గుర్తింపు: అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
Follow us

|

Updated on: Feb 12, 2021 | 10:30 AM

Apple Watch Covid-19: యాపిల్‌ వాచ్‌తో కరోనా లక్షణ గుర్తించవచ్చని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సంప్రదాయంగా నిర్ధారణ పరీక్షల కంటే ముందస్తుగానే యాపిల్‌ వాచ్‌తో కోవిడ్‌ -19 లక్షణాలు గుర్తించవచ్చని అంటున్నారు. న్యూయార్క్‌లోని మౌంట్‌ సినాయి హెల్త్‌ సిస్టంకు చెందిన శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు వేరబుల్‌ హార్డ్‌వేర్‌ (శరీరంపై ధరించే స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌) పరికరాలపై వారు జరిపిన పరిశోధలకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఇంటర్నెట్‌ రీసెర్చ్‌ ప్రచురితం చేసింది. దీనికి సంబంధించి వివరాలు మౌంట్‌ సినాయిలోని ఇచ్చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసెన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రాబర్డ్‌ హైర్డెన్‌ వివరించారు.

ఈ పరిశోధన కోసం మా సంస్థలో పని చేస్తున్న వందలాది మంది హెల్త్‌ కేర్‌ వర్కర్ల ఆరోగ్య ప్రమాణాలను పరిగణలోకి తీసుకున్నాం. ఇందులో పాల్గొన్నవారంతా యాపిల్‌ వాచ్‌ ధరించారు. ప్రతిరోజూ పరిశోధన కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. అలాగే యాపిల్‌ వాచ్‌ ద్వారా వారి గుండె వేగంలో వ్యత్యాసాన్ని నమోదు చేశాం. దాని ఆధారంగా వారి శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించి కోవిడ్‌-19 లక్షణాలను ముందుగానే గుర్తించగలిగాం అని ఆయన అన్నారు.

కానీ వారం రోజుల తర్వాత అంటే వారు పూర్తిగా కోవిడ్‌ నిర్ధారణ తర్వాత మాత్రం వైరస్‌ బారిన పడిన వారి గుండె వేగం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు గుర్తించామని అన్నారు. అలాగే భవిష్యత్తులో ప్రజలు ఇన్ఫెక్షన్‌ కారణంగా అనారోగ్యానికి గురికాకముందే దానిని గుర్తించే సాధనాలను ఆవిష్కరించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: Indian Mountaineers: నేపాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌కు చెందిన ఇద్దరు పర్వతారోహకులపై నిషేధం