ఆస్పత్రిలో చేరిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు

కరాచీ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముష‌ర్రఫ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గతకొంత కాలంగా ముషర్రఫ్ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కాగా ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అత్యవ‌స‌రంగా దుబాయ్ హాస్పిట‌ల్లో చేర్పించారు. ఇప్పటికే ఈ వ్యాధి నివారణ కోసం ముషర్రఫ్ ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు. అయితే మ‌ళ్లీ ఆ వ్యాధి ముద‌ర‌డంతో .. ముష‌ర్రఫ్‌ను దుబాయ్‌కి త‌ర‌లించారు. ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ ఈ విష‌యాన్ని వెల్లడించింది. అమిలోడోసిస్ […]

ఆస్పత్రిలో చేరిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు

కరాచీ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముష‌ర్రఫ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గతకొంత కాలంగా ముషర్రఫ్ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కాగా ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అత్యవ‌స‌రంగా దుబాయ్ హాస్పిట‌ల్లో చేర్పించారు. ఇప్పటికే ఈ వ్యాధి నివారణ కోసం ముషర్రఫ్ ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు. అయితే మ‌ళ్లీ ఆ వ్యాధి ముద‌ర‌డంతో .. ముష‌ర్రఫ్‌ను దుబాయ్‌కి త‌ర‌లించారు. ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ ఈ విష‌యాన్ని వెల్లడించింది. అమిలోడోసిస్ రియాక్షన్‌తో ముష్రర‌ఫ్ బాధ‌ప‌డుతున్నార‌ని డాక్టర్లు వెల్లడించారు.ఈ వ్యాధి ప్రభావంతో ముష‌ర్రఫ్ త‌న కాళ్ల మీద నిల‌బ‌డ‌లేక‌పోతున్నారు, న‌డ‌వ‌లేక‌పోతున్నారు. కాగా గ‌తంలో కూడా ఇదే వ్యాధితీ అస్వస్థతకు గురై.. లండ‌న్‌లో చికిత్స తీసుకున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu