Tornadoes in US: ఫ్లోరిడాలో టోర్నడోల బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం.. కార్లు ధ్వంసం, నిలిచిన కరెంట్‌ సరఫరా

|

May 02, 2023 | 9:10 AM

అమెరికాలో టోర్నడోల బీభత్సం ఆగడం లేదు. తాజాగా మరోసారి అగ్రరాజ్యాన్ని కుదిపేశాయి. ఫ్లోరిడాలో ఉన్నట్లుండి చెలరేగిన కేంద్రీకృత సుడిగాలి తీవ్రతతో పెను విధ్వంసం చోటుచేసుకుంది.

Tornadoes in US: ఫ్లోరిడాలో టోర్నడోల బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం.. కార్లు ధ్వంసం, నిలిచిన కరెంట్‌ సరఫరా
Tornado In Florida
Follow us on

అమెరికాలో టోర్నడోలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఫ్లోరిడాలో టోర్నడోలతో అపారనష్టం జరిగింది. టోర్నడోల ధాటికి చాలా కార్లు ధ్వంసమయ్యాయి. చెట్లు కుప్పకూలాయి. పలుచోట్ల కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగింది. గాలి ఉధృతితో పలు కార్లు కొట్టుకుపోవడం, కొద్ది సేపు గాలిలోనే చక్కర్లు కొట్టడం, పల్టీలు కొడుతూ ఒకవాహనంపై మరోటి చేరడం వంటి భీభత్సాలు జరిగాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఒక చోట ఓ షెడ్ పై కప్పు చాలా దూరం వరకూ ఎగిరిపోయింది. టోర్నడో ధాటికి ఓ చోట ఓ వాహనం పైకి ఎగిరి గాలిపటం మాదిరిగా గుండ్రంగా తిరిగింది. టోర్నడో ధాటికి కొన్ని వాహనాలు దెబ్బతిని వాటి భాగాలు చాలా దూరం వరకూ కొట్టుకుపొయ్యాయి.

ఫ్లోరిడాలోని నార్త్ పామ్ బీచ్‌లో టోర్నడో తీవ్రత ఎక్కువగా ఉంది. పెనుగాలులు విరుచుకుపడటంతో అనేక ఇళ్లు, షాపింగ్‌ మాల్స్‌ కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గాలి తీవ్రతకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. టోర్నోడోల విధ్వంసానికి విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని, లక్షలాది ఇళ్లు చీకట్లలోనే ఉన్నాయి. పెనుగాలుల వల్ల అక్కడక్కడ అగ్నిప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దీంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి వీస్తున్న భీకర గాలుల ప్రభావం టెక్సాస్ మీదుగా పలు ప్రాంతాల్లో ప్రభావం చూపుతాయని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..