Moyamoya Disease: ఆసియా దేశాలను హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి మోయామోయా..పూర్తి వివరాలు
Moyamoya Rare Disease: 'మోయామోయా' వ్యాధి గురించి ప్రపంచంలో చాలా తక్కువ మందికే తెలుసు. ప్రధానంగా ఈ వ్యాధి పిల్లలపై ప్రభావం చూపుతుంది. తూర్పు ఆసియాలో ముఖ్యంగా జపాన్లో ఈ వ్యాధి ఎక్కువ మందికి సోకింది.
ఒక వైపు కరోనా…మరో వైపు అతి అరుదైన వ్యాధి మోయామోయా ఉనికి ఆసియా దేశాలను హడలెత్తిస్తోంది. తూర్పు ఆసియాలో వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. మోయామోయా వ్యాధితో స్ట్రోక్, అరుదైన రక్త నాళాల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. ‘మోయామోయా’ వ్యాధి గురించి ప్రపంచంలో చాలా తక్కువ మందికే తెలుసు. ప్రధానంగా ఈ వ్యాధి పిల్లలపై ప్రభావం చూపుతుంది. తూర్పు ఆసియాలో ముఖ్యంగా జపాన్లో ఈ వ్యాధి ఎక్కువ మందికి సోకింది. పిల్లల్లో స్ట్రోక్ కు కారణమయ్యే అరుదైన వ్యాధుల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స విధానాలను అమెరికాలోని మాయో క్లినిక్ వెల్లడించింది. సీరియస్, అంతుబట్టని వ్యాధుల చికిత్సలో పేరెన్నికగన్న చికిత్సా కేంద్రాల్లో మాయో క్లినిక్ ఒకటి. యూఎస్ న్యూస్, వరల్డ్ రిపోర్ట్ ప్రకారం.. అమెరికాలో నెంబర్ వన్ చికిత్స కేంద్రం మాయో క్లినిక్.
మోయామోయా లక్షణాలు… ఈ వ్యాధి అరుదైన రక్త నాళాల సమస్య. ఇది శరీరంలోని రక్త సరఫరాలో తలెత్తే సమస్య. ఈ సమస్య ఉన్న వారిలో గుండె నుంచి ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని మెదడుకు చేరవేసే కారొటిడ్ ధమనులకు ఆటంకం కలుగుతుంది. రక్త సరఫరా మార్గం మూసుకుపోవడం లేదా సన్నగా మారడం జరుగుతుంది. ఫలితంగా మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా మినీ స్ట్రోక్( చిన్న స్ట్రోక్) లేదా స్ట్రోక్ లేదా మెదడులో రక్త స్రావం జరుగుతుంది. అంతేకాక, మెదడు పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు మనిషి ఆలోచనల సరళి,స్పందన, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది తదితర రుగ్మతలు ఏర్పడుతాయి.
ఎవరికి ఈ వ్యాధి వస్తుంది? వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు. పిల్లల్లో.. చాలా లక్షణాలు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య బహిర్గతమయ్యాయి. పెద్దల్లో.. 30 నుంచి 50 ఏళ్ల వయసున్న వారిలో లక్షణాలు బహిర్గతం అవుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో ఈ వ్యాధి లక్షణాలు వేరువేరుగా ఉంటాయని మాయో క్లినిక్ వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి గురైన పిల్లలో కన్పించే తొలి లక్షణం స్ట్రోక్ లేదా మినీ స్ట్రోక్(ట్రాన్సిఎంట్ ఇశ్చిమిక్ అట్టాక్). ఈ వ్యాధికి గురైన పెద్దల్లో రక్త నాళాల్లో సమస్య కారణంగా మెదడులో రక్త స్రావం(హెమరేజిక్ స్ట్రోక్), స్ట్రోక్ వచ్చే అవకాశముంది.
ప్రారంభంలోనే గుర్తిస్తే.. రోగి సేఫ్.. ప్రారంభంలోనే ఈ వ్యాధి లక్షణాలను గర్తిస్తే.. రోగి కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. సీరియస్ గా.. స్ట్రోక్ వచ్చే స్థాయికి చేరితే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రారంభంలో కన్పించే లక్షణాలు.. తలనొప్పి, బలహీనత, నీరసం, ముఖం లేదా, అరిచేతులు లేదా కాళ్లు మొద్దుబారడం, ముఖ్యంగా శరీరంలో ఒకవైపు మొద్దుబారడం, వినికిడి శక్తి తగ్గడం, మాటలు తడబడటం, నెమ్మదిగా స్పందించడం, అసహజంగా కదలికలు.
వీటితో పాటు ఏడవడం, దగ్గు, గాయాలు జ్వరం వంటి లక్షణాలు రోగిలో మరిన్ని మార్పులకు కారణాలు.
ఈ లక్షణాలు ఎందుకు వస్తాయి ? చాలా మట్టుకు ఈ వ్యాధి లక్షణాలు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయంటున్నారు వైద్యులు. కొరియా, జపాన్, చైనాల్లో ప్రత్యేకమైన జన్యు కారకాల ద్వారా ప్రజలు ఈ వ్యాధి బారినపడుతున్నారు.. కొన్నిసార్లు రక్త ప్రసరణ వ్యవస్థలో కారణంగా కలిగే మార్పులు మోయామోయా వ్యాధి తలపిస్తాయంటున్నారు వైద్యులు. అయితే దీనికి ఇంకా వేరే కారణాలు, వేరే లక్షణాలు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ వ్యాధిని మోయామోయా సిండ్రోమ్ గా పిలుస్తున్నారు వైద్యులు. ఈ సిండ్రోమ్ వచ్చిన వారిలో డౌన్ సిండ్రోమ్, సికిల్ సెల్ అనీమియా, న్యూరో ఫైబ్రోమటోసిస్ టైప్ 1, హైపర్ థైరాయిడిజమ్ కన్పించే అవకాశాలు ఉన్నాయి.
ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ ఎవరికి? భారత్ లోని గురుగ్రామ్ నయన ఆసుపత్రి న్యూరాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ సాహిల్ కోహ్లీ ఈ అరుదైన వ్యాధికి సంబంధించి వివరాలు వెల్లడించారు. అసియన్ దేశాల్లోని వారికి ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా గతంలో ఈ వ్యాధికి గురైన వారి ఉంటే అ కుటుంబంలోని వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు 30 నుంచి 40 రెట్లు అధికంగా ఉన్నట్లు చెప్పారు. మహిళలు, 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ వ్యాధితో ప్రభావితం కావచ్చని తెలిపారు.
ఈ అరుదైన వ్యాధికి చికిత్స… ఇది జన్యు కారణాలతో వచ్చే వ్యాధి కాబట్టి దీన్ని పూర్తిగా రాకుండా చేయలేమంటుంటున్నారు వైద్యులు. చిన్నపిల్లలో ఈ వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందిస్తే.. తీవ్ర సమస్యలనుంచి వారిని కాపాడవచ్చని తెలిపారు. ఈ వ్యాధికి గురై రక్త నాళ మార్గం మూసుకుపోవడం లేదా సన్నగా మారితే మెదడుకు శస్త్ర చికిత్స చేసి బై పాస్ మార్గంలో మెదడులోకి రక్త సరఫరా పునరుద్దరించవచ్చని తెలిపారు. ఇదే విషయాన్ని 2014లోనే.. ఒక అధ్యయన పత్రంలో త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్సిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధక బృందం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..అమెరికా ప్రజలకు ఇక మాస్క్ నుండి విముక్తి…కరోనాను గెలిచినట్లేనా?
గుడ్ న్యూస్.. మరో వారంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి.. ధర ఎంతో తెలుసా.?