AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వీడు మనిషా.. మృగమా? ఎయిర్‌పోర్ట్‌లో చిన్నారిని నేలకేసి కొట్టాడు! దాంతో పాపం చిన్నారి.. CCTVలో అంతా రికార్డ్‌!

మాస్కో షెరెమెటియేవో విమానాశ్రయంలో రెండేళ్ల ఇరానియన్ బాలుడిపై దారుణమైన దాడి జరిగింది. CCTV ఫుటేజ్‌లో, ఒక వ్యక్తి బాలుడిని నేలపైకి కొట్టిన దృశ్యాలు చూపించాయి. తీవ్ర గాయాలతో బాలుడు కోమాలో ఉన్నాడు. నిందితుడు వ్లాదిమిర్ విట్కోవ్ అనే బెలారస్ దేశస్థుడు. దాడికి కారణం ఇంకా తెలియరాలేదు.

Video: వీడు మనిషా.. మృగమా? ఎయిర్‌పోర్ట్‌లో చిన్నారిని నేలకేసి కొట్టాడు! దాంతో పాపం చిన్నారి.. CCTVలో అంతా రికార్డ్‌!
Moscow Airport Attack
SN Pasha
|

Updated on: Jun 26, 2025 | 8:10 AM

Share

ఈ వీడియో చూస్తే.. కచ్చితంగా వీడసలు మనిషేనా లేక మృగమా అని అనిపించకమానదు. రెండేళ్ల చిన్నారిని పైకెత్తుకొని.. పిచ్చికుక్కలా నేలకేసి బలంగా కొట్టాడు. దాంతో.. పాపం ఆ చిన్నారి తల, వెన్నుముకకు బలమైన గాయాలై.. ప్రస్తుతం ఆ చిన్నారి కోమాలోకి వెళ్లి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ రాక్షసుడి రాక్షసత్వం అంతా సీసీటీవీలో రికార్డ్‌ అయింది. ఈ దారుణ ఘటన ఓ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. అటూ ఇటూ చూసి.. పిచ్చి పట్టిన వాడిలా అభంశుభం తెలియని రెండేళ్ల బాబు గట్టిగా నేలకేసి కొట్టిన ఈ విషాద ఘటన మాస్కోలోని మాస్కోలోని షెరెమెటియేవో ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఎయిర్‌పోర్ట్‌లోని రాకపోకల హాలులో ఒక వ్యక్తి ఇరానియన్ బాలుడిని ఎత్తుకుని నేలకేసి గట్టిగా కొట్టాడు. దీంతో ఆ చిన్నారి పుర్రె పగిలిపోయింది. వెన్నెముక గాయాలు అయ్యాయి. అతను ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. ఆ పిల్లవాడు ఇటీవలే తన తల్లితో కలిసి రష్యాకు వచ్చాడు. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బాంబు దాడుల నుండి తప్పించుకునేందుకు రష్యాకు వచ్చేసింది ఆ కుటుంబం. అయితే సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ పసిపాప తన ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్‌ను పట్టుకుని నిల్చున్నాడు. సమీపంలో తెల్లటి టీ-షర్ట్, షార్ట్ ధరించి, నల్లటి సన్ గ్లాసెస్ నుదుటిపై పెట్టుకుని, చేతులు జేబుల్లో పెట్టుకుని ఉన్న ఒక వ్యక్తి.. ఆ చిన్నారి వద్దకు వచ్చి, అటూ ఇటూ చూసి.. ఒక్కసారిగా ఆ బాబును ఎత్తి నేలకేసి కొట్టాడు. ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. వెంటనే చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆ బాలుడ్ని తీసుకెళ్లాడు. పోలీసులు వచ్చి.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు.

ఈ దాడి వీడియోను భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే దాడి జరిగిన సమయంలో ఆ బాలుడి తల్లి తన వీల్‌ చైర్‌ను తీసుకొచ్చేందుకు వెళ్లింది. ఆమె గర్భంతో ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌ చైర్‌ కోసం వెళ్లింది. ఇంతలో దారుణం జరిగిపోయింది. దాడి చేసిన వ్యక్తిని బెలారస్‌కు చెందిన వ్లాదిమిర్ విట్కోవ్ (31) గా గుర్తించారు పోలీసులు. దాడికి ముందు అతను బాలుడిని గమనిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఈ దాడి జాతి వివక్షతో జరిగిందా? లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే దానిపై రష్యన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో అతను డ్రగ్స్‌ తీసుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి