AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా వీసాల కోసం చూసే భారతీయులకు అలర్ట్.. US ఎంబసీ కొత్త రూల్..

అమెరికా వీసా కావాలంటే నో ప్రైవసీ పాటించాల్సిందే..! ఈ కొత్త నిబంధన గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.. లేదంటే వీసా రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ కొత్త రూల్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఒకసారి చూసేయండి

అమెరికా వీసాల కోసం చూసే భారతీయులకు అలర్ట్.. US ఎంబసీ కొత్త రూల్..
Us Visa
Ravi Kiran
|

Updated on: Jun 26, 2025 | 10:35 PM

Share

విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి వీసా పొందడం ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ముఖ్యంగా అమెరికా వీసా రావడం కష్టంగా మారింది. అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎన్నో డాక్యుమెంట్స్‌ సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. చాలా సెక్యూరిటీ చెకప్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో మరో కొత్త మార్పు వచ్చింది. సోషల్ మీడియా సెట్టింగ్‌ కూడా వీసా అప్రూవల్‌కి కీలకం కానుంది. ఇకపై, విద్యార్థులు, పర్యాటకులు సహా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సోషల్ మీడియా అకౌంట్స్‌ను పబ్లిక్ సెట్టింగ్‌లో ఉంచడం తప్పనిసరి అని అధికారులు తేల్చి చెప్పారు. USఎంబసీ-ఇండియా ఇచ్చిన ఆర్డర్స్‌ ప్రకారం ఎవరైతే F, M, J నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలకు అప్లై చేస్తారో వాళ్లంతా కూడా సోషల్ మీడియా వెట్టింగ్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న ప్రైవసీ ఆప్షన్‌ని డిసేబుల్ చేసి.. అంతా పబ్లిక్ చేసేయాలి. ఏ మాత్రం దాపరికం ఉండకూడదు.

అమెరికా వీసాల్లో F రకం వీసాను చదువుకునే విద్యార్ధులకు ఇస్తారు. M రకం వీసా ఒకేషనల్ కోర్సుల కోసం అప్లై చేసేవారికి లభిస్తుంది. J అంటే ఎక్స్చైంజ్ విజటర్ వీసా. అంటే రీసెర్చ్, స్కాలర్స్, ఇంటర్న్‌షిప్కు వెళ్లేవారికి ఇస్తారు. హెచ్1బి వీసాలకు ఇప్పటికే చాలా నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన వీసాలకు కూడా నిబంధనలు విధించింది అమెరికా. చాలామంది సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబ వివరాలు ప్రైవసీలో పెడుతుంటారు. యూఎస్ ఎంబసీ విధించిన నో ప్రైవసీ రూల్ ప్రకారం ఇక అన్నీ బహిర్గతంగా ఉండాలి. సోషల్ మీడియాలో చాలా మంది తమకు ఇష్టమైన ఫోటో పెట్టుకుంటారు. కానీ US వెళ్లాలనుకుంటే అది కుదరదు, ఖాతాదారుడి ఫోటోనే ఉండాలి. ఇదంతా ఎందుకంటే US వీసా అప్లై చేసినప్పుడు ఈ సమాచారాన్ని ఎంబసీ అధికారులు తనిఖీ చేస్తారు. ఏ మాత్రం తేడా అన్పించినా వీసా తిరస్కరిస్తారు.

Follow Us
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..