లెబనాన్ ప్రజలు ఇప్పుడు ఏ పేజర్‌లో ఏ బాంబ్ ఉందో తెలియక హడలిపోతున్నారు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న పేలుళ్లు అక్కడి ప్రజల వెన్నులో వణుకుపుట్టేలా చేశాయి. డివైజ్‌లు డైనమేట్లలా పేలడంతో వాటిని ముట్టుకోవాలంటేనే భయపడిపోతున్నారు. లెబనాన్‌లో వరుసగా రెండో రోజు పలు పేలుళ్లు సంభవించాయి. మంగళవారం పేజర్లు, బుధవారం వాకీటాకీలు పేలాయి. కొన్ని ప్రాంతాల్లో ఇతర ఎలక్ట్రానికి పరికరాలైన ల్యాప్‌టాప్, వాకీ-టాకీ, మొబైల్ పేలాయని తెలుస్తోంది. బీరూట్‌లో కొన్ని ప్రాంతాల్లో సోలార్ పరికరాలు పేలాయని ప్రకటించారు. ఇలాంటి పేలుడు ఘటనలు చాలా నగరాల్లో జరిగినట్లు వెలుగు చూస్తున్నాయి. బుధవారం జరిగిన పేలుళ్ళలో 20 మంది మరణించారు. 450 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం బీరుట్, బెకా, నబాతిహ్, దక్షిణ లెబనాన్‌లలో గంట వ్యవధిలో వందలాది మంది గాయపడ్డారు. ఇళ్లలో మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఉపకరణాలు కూడా పేలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని భవనాల్లో మంటలు చెలరేగాయి. దక్షిణ లెబనాన్, బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించాయి.
పేజర్ పేలుడు ఘటనల్లో మరణించిన హిజ్బుల్లా బాలురు, పిల్లల అంత్యక్రియల సమయంలో కూడా అనేక పేలుళ్లు వినిపించాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ నిర్వహించిందని హిజ్బుల్లా మంగళవారం ప్రకటించింది. లెబనాన్, సిరియాలో పేలిన పేజర్లను హంగేరియన్ కంపెనీ తయారు చేసింది. తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ ఇదే చెప్పింది.
అమెరికా అధికారి షాకింగ్ వాదన
మరో బుడాపెస్ట్ కంపెనీ ఈ పేజర్లను తయారు చేసిందని గోల్డ్ అపోలో పేర్కొంది. అయితే డెలివరీకి ముందే పేజర్‌లో పేలుడు పదార్థాలను పెట్టి ఉండొచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. మంగళవారం జరిగిన ఈ పేలుడులో ఇద్దరు చిన్నారులు సహా 12 మంది చనిపోయారు. 3 వేల మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడిందని హిజ్బుల్లా, లెబనీస్ ప్రభుత్వం రెండూ చెబుతున్నాయి. మరోవైపు అమెరికా అధికారి ఒకరు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. దాడి తర్వాత ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం అందించిందని ఆయన చెప్పారు. పేజర్‌లో తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నాయి.
పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉంది
అల్ మనార్ నివేదిక ప్రకారం లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లు వాకీ టాకీలలో జరిగాయి. పేలిన హిజ్బుల్లా ఉపయోగించిన పేజర్లు హంగేరియన్ కంపెనీ తయారుచేసింది. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉంది. ఈ పేలుళ్ల తర్వాత ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య వివాదం మరింత పెరిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..