Pakistan PM Imran Khan: పాకిస్తాన్‌‌లో మొదలైన రాజకీయ రచ్చ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడకు బిగుస్తున్న ద్రవ్యోల్బణం ఉచ్చు..

| Edited By: Rajeev Rayala

Feb 17, 2022 | 2:44 PM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వర్నింగ్ ఇచ్చారు. అయితే ఈ హెచ్చరిక చేసిదిఎవరికో కాదు ఆ దేశంలోని ప్రతిపక్ష నేతలకు..

Pakistan PM Imran Khan: పాకిస్తాన్‌‌లో మొదలైన రాజకీయ రచ్చ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడకు బిగుస్తున్న ద్రవ్యోల్బణం ఉచ్చు..
Imran Khan
Follow us on

పాకిస్తాన్(Pakistan) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (PM Imran Khan)మరోసారి వర్నింగ్ ఇచ్చారు. అయితే ఈ హెచ్చరిక చేసిదిఎవరికో కాదు ఆ దేశంలోని ప్రతిపక్ష నేతలకు.. తనను అధికారం నుంచి తొలగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రతిపక్షాలను బెదిరించారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు పడిపోతుండటంతో అక్కడి పార్టీ నిరసనలకు దిగుతున్నాయి. ప్రధాని పదవి నుంచి వెంటనే దిగిపోవాలని ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జియో టీవీ ప్రకారం.. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరను లీటరుకు 12.03 పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 147.82 నుంచి 159.86కి చేరింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌తోపాటు అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇమ్రాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

దేశంలో ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరిగింది. చక్కెర, గోధుమల కుంభకోణంపై ఇమ్రాన్ ప్రభుత్వం కూడా ఖండించబడింది. PML-N కాకుండా.. సింధ్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తాజా వాహబ్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోలు ధరను పెంచడం ద్వారా ఇమ్రాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రజలపై పెట్రోల్ బాంబులు వేసిందని అన్నారు. అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచడం పూర్తిగా తప్పు అని జమాతే ఇస్లామీ చీఫ్ సిరాజ్ ఉల్ హక్ అన్నారు.

దీంతో సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తుండటంతో ఇమ్రాన్ ఊగిపోయారు. తాను వీధుల్లోకి వస్తే ప్రతిపక్ష పార్టీలకు దాచడానికి స్థలం ఉండదని అన్నారు. తాను వీధుల్లోకి వస్తే ప్రమాదకరమని, తనను ప్రధాని పదవి నుంచి దించాలని ప్రతిపక్షాలను హెచ్చరించారు.

పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

 

తనను ఇంటికి పంపే ఆలోచనలో ప్రత్యర్థులు ఉంటే.. వారి కనీసం దాచుకునేందుకు దేశంలో స్థానం ఉండదని హెచ్చరించారు. దీంతో ప్రతిపక్షాల నుంచి మరింత వ్యతిరేకత వస్తోంది. ఆ దేశంలోని PML-Q , MQM -P తో కలిపి 177 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్. 162 సీట్లు కలిగి ఉన్న ప్రతిపక్షం , స్వతంత్రులుగా ఉన్న 3 సీట్లు. 172 మంది అవిశ్వాసానికి ఓటు వేస్తె ఇమ్రాన్ పదవికి ఘండం ఏర్పడే ఛాన్స్ ఉంది. అయితే పాక్ ఆర్మీ నిర్ణయం పైనే ఇమ్రాన్ భవిష్యత్తు ఉంది.

ఇవి కూడా చదవండి: Medaram Jathara 2022: మహా జన జాతరలో సందడిగా తొలి ఘట్టం.. ఇవాళ సమ్మక్క ఆగమనం

CM KCR Birthday: 68వ వసంతంలోకి సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు..