Monkeypox: మంకీపాక్స్‌ మరణమృదంగం… అమెరికాలో మొట్టమొదటి మరణం నమోదు..

|

Sep 13, 2022 | 2:01 PM

ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ వ్యాధి సోకండంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడిలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు.

Monkeypox: మంకీపాక్స్‌ మరణమృదంగం... అమెరికాలో మొట్టమొదటి మరణం నమోదు..
Monkeypox
Follow us on

Monkeypox: అమెరికాలో మంకీపాక్స్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అక్కడ మొట్టమొదటి మంకీపాక్స్‌ మరణం కేసు నమోదైంది. లాస్‌ ఏంజెల్స్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ వ్యాధి సోకండంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడిలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని మరణించాడని యుఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ నిర్థారించింది. రోగి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వమించగా,… మంకీపాక్స్‌ వల్లే మరణించాడని తేలింది.. ఈ మేరకు లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వైద్యులు వెల్లడించారు.

గత నెలలో టెక్సాస్‌ నగరంలో మంకీపాక్స్‌ కేసుతో పోస్టుమార్టంలో ఒకరు మరణించినా అతను మంకీపాక్స్‌ వల్లనే మృతి చెందినట్లు తేలలేదని యుఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది.

ఇదిలా ఉంటే, అమెరికా దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 22వేలకు పెరిగింది. మంకీపాక్స్ వ్యాధి సోకినా మరణాలు మాత్రం నమోదు కాలేదు. కానీ, తాజాగా ఒక మంకీపాక్స్ మృతి నమోదు కావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి