Wedding Gown: ప్రస్తుతం కరోనా మహమ్మారి నివారణకు మాస్కులు, శానిటైజర్లు ధరించడం తప్పనిసరి అయ్యాయి. అయితే వాడి పడేసే మాస్కుల వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు దాగి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మాస్క్ ల వలన పర్యావరణానానికి హాని కలిగించకుండా వివిధ రూపాయలుగా వినియోగించేలా ఆలోచలు చేస్తున్నారు. ఇప్పటికే మాస్కులతో రోడ్డులను వేస్తుండగా తాజాగా వాడి పడేసిన మాస్కులతో ఓ డిజైనర్ వెడ్డింగ్ డ్రస్‌ను రూపొందించారు.
బ్రిటన్‌లోని ప్రముఖ డిజైనర్ డిజైనర్ టామ్ సిల్వర్ వుడ్ ఫేస్ మాస్క్‌లను ఉపయోగించుకుని, వాటిని అందంగా మార్చాలనే ఆలోచన చేశారు. టామ్ ఆలోచనకు .ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహకారాన్ని అందించింది. దీంతో డిజైనర్ టామ్ సిల్వర్‌వుడ్ 1500 మాస్కులను ఉపయోగించి అద్భుతమైన వివాహ గౌను తయారు చేశారు. రీ సైకిల్ చేసిన పీపీఈ కి ట్‌తో గౌనుకు ఆకారాన్ని తీసుకొచ్చి అందమైన తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌ను తయారుచేశారు. ఈ వెడ్డింగ్ గౌన్ ను జెమిమా హాంబ్రో అనే మోడల్ ధరించి.. లండన్‌లోని సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ ముందు ఫొటోలకు పోజులిచ్చింది.
కరోనా నివారణ కోసం మాస్కులు రోజువారీ జీవితంలో తప్పనిసరి అని ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఆ వ్యర్ధాలకు అర్ధం కలిపిస్తూ.. డిఫరెంట్ పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్క్ తయారీదారులు సైతం… వీటికి కొత్త హంగులు జోడిస్తున్నారు. చిన్న నగలు, ఆక్సెసరీలను జత చేస్తున్నారు.
Also Read: సినిమా స్టోరీని తలపించే ఆ సీనియర్ నటి ప్రేమ పెళ్లి… కలుసుకున్న రోజునే లవ్.. కొన్ని గంటలకే వివాహం..