St. Paul City: అమెరికాలో చరిత్ర సృష్టించిన నగరం.. ఇకపై మహిళలు మాత్రమే పాలన..

| Edited By: Ravi Kiran

Jan 26, 2024 | 10:00 AM

కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా మహిళల ఆలోచనల్లో కూడా మార్పులు వస్తున్నాయి. వంటింటి కుందేలు నుంచి బయట ప్రపంచంలో అడుగు పెట్టి.. తమ కంటూ ఓ గుర్తింపుని సొంతం చేసుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. అయినపప్పటికీ పురుషులతో పోలిస్తే.. ముఖ్యంగా రాజకీయాల్లో స్త్రీల శాతం తక్కువే అని చెప్పవచ్చు. అటువంటి పరిస్థితిలో ఒక అమెరికన్ నగరానికి చెందిన కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత అమెరికాలోని సెయింట్ పాల్ సిటీ ప్రెసిడెంట్ అయిన మిత్ర జలాలీ కూడా షాక్ తిన్నారు. 

St. Paul City: అమెరికాలో చరిత్ర సృష్టించిన నగరం.. ఇకపై మహిళలు మాత్రమే పాలన..
St. Paul Makes History
Follow us on

ఎంత చెప్పినా ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఎక్కువ శాతం పురుషులదే ఆధిపత్యం.. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో కూడా సంస్థల్లో, ఉద్యోగాల్లో, పరిశ్రమల్లో రాజకీయంగా ఇలా అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయించేది మగవారే.. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా మహిళల ఆలోచనల్లో కూడా మార్పులు వస్తున్నాయి. వంటింటి కుందేలు నుంచి బయట ప్రపంచంలో అడుగు పెట్టి.. తమ కంటూ ఓ గుర్తింపుని సొంతం చేసుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. అయినపప్పటికీ పురుషులతో పోలిస్తే.. ముఖ్యంగా రాజకీయాల్లో స్త్రీల శాతం తక్కువే అని చెప్పవచ్చు.

అటువంటి పరిస్థితిలో ఒక అమెరికన్ నగరానికి చెందిన కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత అమెరికాలోని సెయింట్ పాల్ సిటీ ప్రెసిడెంట్ అయిన మిత్ర జలాలీ కూడా షాక్ తిన్నారు.  మరి సిటీ ప్రెసిడెంట్ కు షాక్ ఇచ్చిన విషయం ఏమిటో వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని ఒక రాష్ట్రం  మిన్నెసోటా. దీని రాజధాని సెయింట్ పాల్ సిటీ. ఈ నగర జనాభా మూడు లక్షల వరకు ఉంటుంది. సెయింట్ పాల్ సిటీ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షురాలు మిత్రా జలాలి హాజరయ్యారు. ఆ సమావేశంలో ఉన్న సభ్యులందరూ మహిళలే అని ఆమె గుర్తించింది.  మొదట ఆశ్చర్య పడ్డా.. తర్వాత చాలా సంతోషించారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పర్యవేక్షించే కొందరు నిపుణులు ఈ విషయం పై మాట్లాడుతూ..  కౌన్సిల్ సభ్యులు అంతా స్త్రీలే ఉన్న నగరంగా సెయింట్ పాల్ సిటీ చరిత్ర సృష్టించిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఏడుగురిలో ఆరుగురు నల్లజాతీయులు

కౌన్సిల్‌లోని ఏడుగురు మహిళలు 40 ఏళ్లలోపు వారే కావడం విశేషం. అలాగే, ఏడుగురు స్త్రీలలో ఆరుగురు నల్ల జాతీయులు. శ్వేతజాతీయులు నల్లజాతీయులు పట్ల వివక్షత చూపుతారు అంటూ ఆరోపణను తరచుగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పడు ఇది అమెరికాకు ఇది పెద్ద విజయంగా చెబుతున్నారు. ఏడుగురు మహిళల్లో ఒకరు సివిల్ ఇంజనీర్ కాగా, ఇతర సభ్యులు వివిధ వృత్తుల్లో అనుభవం ఉన్నవారు. ఈ విధంగా  సెయింట్ పాల్ సిటీ వైవిధ్యాన్నీ సాధించిన ఘనతగా ప్రదర్శిస్తోంది.

ఇది ఎందుకు పెద్ద విషయం అంటే..

అమెరికాలో ఇప్పటికీ మున్సిపల్ అధికారులుగా మహిళకు ప్రాతినిధ్యం లేదు. ఎక్కువ మంది పురుషులే ఈ విభాగంలో పనిచేస్తున్నారు. అందులోనూ ఎక్కువమంది శ్వేతజాతీయులే అధిక భాగం ఆక్రమించారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన మొదటి సిటీగా సెయింట్ పాల్ సిటీ  నిలిచింది అని అమెరికాలోని కొందరు నిపుణులు చెప్పారు.