చైనాలో కోట్లాది ప్రజలకు మూల ఆహార వనరైన హైబ్రిడ్ రైస్ ని సృష్టించి వారి ఆకలి తీర్చిన యువాన్ లాంగ్ పింగ్ శనివారం కన్ను మూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు.. హ్యూమన్ ప్రావిన్స్ లోని చాంగ్ షా నివాసి అయిన ఈయన తన జీవితమంతా వివిధ రకాల వరి వంగడాలను పండించడంలో విశేష కృషి చేశారు. ఆయన భౌతిక కాయాన్ని మింగ్ యాంగ్ షాన్ లోని ఫ్యునెరల్ హోమ్ లో ఉంచినప్పుడు ఆయనకు నివాళులర్పించేందుకు లక్ష మందికి పైగా చైనీయులు కొన్ని కిలోమీటర్ల దూరం మేరా బారులు తీరారు. తొలుత ఆయన చికిత్స పొందిన ఆసుపత్రి వద్దకు వేలాది మంది చేరుకున్నారు. కొంతకాలంగా అస్వస్థుడుగా ఉన్న యువాన్ మరణించారని తెలియగానే చైనా విషాదంలో మునిగిపోయింది. ఆయన భౌతికకాయం ఉంచిన శవపేటిక వెంట పెద్ద సంఖ్యలో ప్రజలు నడిచారు.,అనేకమంది ‘ఫేర్ వెల్ గ్రాండ్ పా యువాన్ ‘ అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల రైస్ వెరైటీలపై పరిశోధనలు చేసిన యువాన్ మృతికి ఐక్య రాజ్య సమితి లోని ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫైర్ విభాగం సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆయన చేసిన రీసర్చ్ అమూల్యమైనదని ప్రశంసించింది. 1930 లో బీజింగ్ లో పుట్టిన ఈయన 1973 లో హై ఈల్డ్ హైబ్రిడ్ రైస్ స్ట్రెయిన్ ని పండించడంలో సక్సెస్ అయ్యారు. అసలు ఈ విధమైనదాన్ని సృష్టించడం అసాధ్యమన్న వ్యవసాయ శాస్త్రజ్ఞుల అభిప్రాయం తప్పని నిరూపించారు.
ఫ్యునెరల్ హోమ్ వద్ద లక్షలాది మంది మౌనంగా ఆయన మృతికి సంతాపం తెలుపగా .. ఆన్ లైన్ ద్వారా కూడా కోట్లాది నెటిజన్లు తమ ప్రగాఢ విచారాన్ని తెలియజేశారని గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. సౌత్ వెస్ట్ యూనివర్సిటీ వద్ద ఇప్పటికే ఆయన శిలావిగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆయనకు ఈ కోట్లాది దేశ ప్రజలు ఎంతగానో రుణపడి ఉన్నారని చాంగ్ షా నివాసులు పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Covid-19: కరోనా మరణాల్లో మూడోస్థానానికి భారత్.. అమెరికా, బ్రెజిల్ తరువాత దేశంలో 3 లక్షలు దాటిన కరోనా మరణాలు..