AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: కరోనా మరణాల్లో మూడోస్థానానికి భారత్.. అమెరికా, బ్రెజిల్ త‌రువాత దేశంలో 3 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు..

India Covid-19 Deaths: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం సెకండ్ వేవ్

Covid-19: కరోనా మరణాల్లో మూడోస్థానానికి భారత్.. అమెరికా, బ్రెజిల్ త‌రువాత దేశంలో 3 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు..
India Covid-19 Deaths
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2021 | 9:38 AM

Share

India Covid-19 Deaths: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కూడా భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే.. మన దేశంలో కరోనా ఫ‌స్ట్ వేవ్ భీక‌ర ప్ర‌ళ‌యాన్ని సృష్టించ‌క‌పోయినా.. సెకెండ్ వేవ్ అతలాకుతలం చేస్తుంది. కేసుల సంఖ్య కాస్త త‌గ్గినప్ప‌టికీ.. నిత్యం క‌రోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. క‌రోనా మృతుల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే మూడవ స్థానానికి చేరకుంది. తాజగా దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటింది. దీనికిముందు అమెరికా, బ్రెజిల్‌లో కరోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య మూడు లక్షలు దాటింది. నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో క‌రోనా వైర‌స్ సోకి ఇప్పటివరకూ 2,99,266 మంది మృతి చెందారు. దీనికి రాష్ట్రాల నుంచి వ‌చ్చిన తాజా డేటాను జ‌త‌చేస్తే ఈ సంఖ్య మూడు లక్షలు దాటినట్లు ఆరోగ్యశాక వెల్లడించింది.

కాగా దేశంలో అత్య‌ధిక మంది మహారాష్ట్రలో మరణించారు. మహారాష్ట్రలో దాదాపు 90వేల మంది మరణించారు. కర్ణాటకలో 24వేల మంది, ఢిల్లీలో 23 వేలు, తమిళనాడులో 20వేలకు పైగా మరణించారు. అయితే.. దేశంలో కరోనా కారణంగా మరణించిన వారిలో 70 శాతానికి పైగా బాధితులు ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన ప‌డిన‌వారేన‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికిముందు ప్రపంచంలో అత్యధిక కోవిడ్ కేసులు న‌మోదైన‌ దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ప్రస్తుతం క‌రోనా సెకెండ్ వేవ్‌ దేశంలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. నాలుగు వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టాయి. రెండున్నర లక్షలకు చేరువలో కేసులు నమోదవుతుండగా.. దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Also Read:

వ్యాక్సిన్ల కొనుగోలులో జాప్యం….ఇప్పటికైనా మేల్కొనాలంటున్న ప్రముఖ వైరాలజిస్ట్, థర్డ్ కోవిద్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలని సూచన

Baba Ramdev: బాబా రామ్‌దేవ్ వివరణపై స్పందించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. వివాదాన్ని ముగిద్దామంటూ ట్వీట్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!