Mexico Earthquake: భారీ భూకంపం.. చిగురుటాకుల్లా వణికిన భవనాలు.. వీడియో..

|

Sep 08, 2021 | 8:59 AM

Earthquake in Mexico : మెక్సికో దేశంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ భారీ భూకంపంతో

Mexico Earthquake: భారీ భూకంపం.. చిగురుటాకుల్లా వణికిన భవనాలు.. వీడియో..
Mexico Earthquake
Follow us on

Earthquake in Mexico : మెక్సికో దేశంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ భారీ భూకంపంతో చాలా భవనాలు కొద్దిసేపు ఊగినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో ఉన్నట్లు సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం వల్ల వందలాది కిలోమీటర్లదూరంలో భవనాలు ఊగాయి. రాజధానిలోని భవనాలు చిగురుటాకుల్లా వణికినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు.

ఈ భూకంపం వల్ల భారీ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ ట్విట్టర్‌లో తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి. ప్రస్తుతం ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భూకంపం సంభవించినప్పుడు అర్ధరాత్రి మెక్సికో నగరంలోని భవనాలు కదులుతుండగా.. లైటింగ్ ఫ్లాష్ అయిన వీడియోను పలువురు పంచుకుంటున్నారు.

కాగా.. 1985 సెప్టెంబరు 19వతేదీన సంభవించిన తీవ్ర భూకంపం వల్ల 10వేల మందికిపైగా మరణించగా, వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి. 2017లో సంభవించిన భూకంపంలో 370 మంది మరణించారు.

Also Read:

Afghanistan Crisis:ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్.. ఇది తాత్కాలికమే!

Taliban Rule: తాలిబాన్ ప్రభుత్వంలో ఆ మంత్రి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్..అతనిపై ఎంత రివార్డు ఉందో తెలిస్తే షాక్ అవుతారు..