Pakistan Floods: డ్రాగన్ వరద సాయం ఇదేనా..? చైనా-పాకిస్థాన్ సంబంధాన్ని పరీక్షిస్తోన్న సంక్షోభం.. కానీ..

వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది వరదలకు ప్రభావితమయ్యారు. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు వరదలతో సతమతమవుతున్న పాకిస్థాన్ పరిస్థితి.. దయనీయంగా మారింది.

Pakistan Floods: డ్రాగన్ వరద సాయం ఇదేనా..? చైనా-పాకిస్థాన్ సంబంధాన్ని పరీక్షిస్తోన్న సంక్షోభం.. కానీ..
Pakistan Floods

Updated on: Sep 13, 2022 | 9:45 PM

China-Pakistan relationship: పాకిస్తాన్‌లో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కురిసిన వర్షాలకు దయాది దేశం అతాలాకుతలం అవుతోంది. వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది వరదలకు ప్రభావితమయ్యారు. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు వరదలతో సతమతమవుతున్న పాకిస్థాన్ పరిస్థితి.. దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు బలమైన ఆర్థిక పరిస్థితితో ఎదుగుతున్న భారత్‌, మరోవైపు బీజింగ్‌తో అనుమానాస్పద సంబంధాలు.. సొంత దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో సతమతమవుతున్న పాకిస్తాన్.. చైనాకు సామంత రాజ్యంగా మారవచ్చని.. వ్యాసకర్త జహంగీర్ అలీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన న్యూస్9కి ప్రత్యేక వ్యాసం రాశారు. పాకిస్తాన్‌లో మూడింట ఒక వంతును ప్రభావితం చేసిన వరదలు.. ఇస్లామాబాద్ – బీజింగ్ మధ్య సంబంధాలకు ప్రధాన పరీక్షగా ఉద్భవించింది.

గత దశాబ్దంలో.. పాకిస్తాన్ తన పాశ్చాత్య అనుకూల విదేశాంగ విధానం నుంచి నెమ్మదిగా విరమించుకుంది. కమ్యూనిస్ట్ పాలనతో ఉన్న చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకుంది. క్షీణిస్తున్న దాని ఆర్థిక అదృష్టాన్ని పునరుజ్జీవింపజేయాలనే ఆశతో చైనాను ఆశ్రయించింది. దీనికి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) మరింత ఊతమిచ్చింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఫ్లాగ్‌షిప్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)లో భాగమైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో పుంజుకోవడానికి ఇస్లామాబాద్.. బీజింగ్‌ను అనుమతించింది.

బెడిసికొట్టిన వ్యూహాత్మక ఆలోచన..

ఇవి కూడా చదవండి

ఇస్లామాబాద్ వ్యూహాత్మక ఆలోచన కొంతవరకు USతో దాని సంబంధాలు క్షీణించడం ద్వారా, పాక్షిక తీవ్రవాదంపై యుద్ధంతో వచ్చిన విదేశీ సహాయం తగ్గిపోవడంతో ఈ విధంగా అడుగులు వేసింది. గత సంవత్సరం కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ బంధం అకస్మాత్తుగా ముగిసిపోయింది.

బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, BRI అందించే అవకాశాల గురించి అంచనాతో ఉన్న పాకిస్తాన్.. చైనాను తన అత్యంత కీలకమైన ఆర్థిక, భద్రత, దౌత్య భాగస్వామిగా చేయడం ద్వారా తన పశ్చిమ అనుకూల ధోరణిని పూర్తిగా రద్దు చేసింది. ఇస్లామాబాద్‌లో మార్పు అనేది ఆసియాకే కాకుండా ప్రపంచ రాజకీయాలు, భద్రతపై ప్రభావం చూపే ప్రధాన భౌగోళిక రాజకీయ పరిణామం.

చైనా ఇక పాక్‌కి సర్వ మిత్రుడు కాదా?

అయితే పాకిస్తాన్ – చైనా ఆట మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చని చాలా మంది విశ్వసిస్తున్నారు. తాజా వరదల కారణంగా ఏర్పడిన సంక్షోభంపై తన మిత్రుడు బీజింగ్ అందించిన సహాయం కేవలం ఒక సూచిక మాత్రమే కావచ్చు. అత్యంత దారుణమైన వరదలతో $18 బిలియన్ల నష్టాన్ని చవిచూసిన పాక్‌కు చైనా 400 మిలియన్ యువాన్ల ద్రవ్య సహాయం మాత్రమే చేసి చేతులు దులుపుకుంది. 2010లో ఇదే విధమైన వరద సంభవించినప్పుడు ఇస్లామాబాద్‌కు వాషింగ్టన్ అందించిన మిలియన్ల డాలర్లతో పోల్చితే చైనా సాయం ఎంతో తక్కువ..

వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయిన దేశంలో 4,000 టెంట్లు, 50,000 దుప్పట్లు, 50,000 వాటర్‌ప్రూఫ్ టార్ప్ ల చైనా సహాయం ఓ జోక్‌గా కనిపిస్తుంది.

గల్ఫ్ విస్తరిస్తున్నదా?

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం 969-మెగావాట్ల నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్ట్ మరమ్మతులను చైనా ఇంజనీర్లు, ఇతర సిబ్బంది గత వారం వదిలిపెట్టివెళ్లారు. దీంతో ఇస్లామాబాద్ – బీజింగ్ మధ్య గల్ఫ్ అంశం కూడా తెరపైకి వచ్చింది.

చైనా కార్మికులు మరమ్మతులు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరారు. వారికి ఇవ్వకపోవడంతో కార్మికులు మరమ్మతులు చేయడానికి నిరాకరించారు. దీంతో చైనాయేతర విదేశీ కన్సల్టెంట్‌లను నియమించుకుంటామని ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనను జారీచేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది.

చైనా ఇది ఆలోచించాలి..

మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న తన సొంత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై చైనా ప్రస్తుతం ఎక్కువ శ్రద్ధ చూపుతుందని వ్యూహాత్మక నిపుణులు భావిస్తున్నారు. మైండ్‌ఫుల్ లెండింగ్ (US$ 87.7 బిలియన్) ఇస్లామాబాద్‌ను చైనా కబంధహస్తాల్లో ఉంచినప్పటికీ, అధిక వడ్డీ రేట్లు, కఠినమైన పరిస్థితులు రుణ ఉచ్చులకు ప్రసిద్ధి చెందిన బీజింగ్‌కు ఆర్థికంగా మరింత ఫలవంతమైన సంబంధాన్ని కలిగిస్తాయి.

ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశం ఉనికి.. మరొక వైపు బీజింగ్ ఉచ్చు.. రాజకీయ, ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ఇస్లామాబాద్ చైనాకు సామంత రాష్ట్రంగా మారేందుకు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది.

Source Link

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..