AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Date of Death: నాడు క్వీన్ ఎలిజబెత్ ‘డెత్ డేట్’.. నేడు కింగ్ చార్లెస్ ‘డెత్ డేట్‌’.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వ్యక్తి..

Date of Death: చావంటే ఎవరైనా భయమే.. అందునా మరణించే తేదీ ముందుగా తెలిస్తే?... బ్రిటన్‌ రాణి మరణ తేదీని ముందే వెల్లడించిన ఓ వ్యక్తి ఇప్పుడు..

Date of Death: నాడు క్వీన్ ఎలిజబెత్ ‘డెత్ డేట్’.. నేడు కింగ్ చార్లెస్ ‘డెత్ డేట్‌’.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వ్యక్తి..
King
Shiva Prajapati
|

Updated on: Sep 14, 2022 | 6:22 AM

Share

Date of Death: చావంటే ఎవరైనా భయమే.. అందునా మరణించే తేదీ ముందుగా తెలిస్తే?… బ్రిటన్‌ రాణి మరణ తేదీని ముందే వెల్లడించిన ఓ వ్యక్తి ఇప్పుడు కొత్త రాజు డెత్‌ డేట్‌ కూడా ప్రకటించి కలకలం రేపాడు. యునైటెడ్‌ కింగ్‌డమ్ రాణి ఎలిజబెత్‌ 2 మరణంతో దేశ ప్రజలంతా విచార సాగరంలో మునిగిపోయారు. లిజ్‌ ట్రస్‌ను కొత్త ప్రధానమంత్రిగా నియమించిన రెండు రోజులకే ఎలిజబెత్‌ తీవ్ర అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. అదే సమయంలో అందరి దృష్టి ఓ వ్యక్తి మీద పడింది.

లోగాన్ స్మిత్‌ అనే వ్యక్తి తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఈ ఏడాది జులైలో పెట్టిన పోస్టును సరదాగా భావించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రాణి ఎలిజబెత్‌ సెప్టెంబర్ 8, 2022న మరణిస్తారు అని లోగాన్‌ ట్వీట్‌ చేశాడు. అయన చెప్పినట్లుగానే అదే రోజున క్వీన్‌ కన్నుమూశారు. అతని జోస్యం ఫలించడం అందరినీ ఆశ్యర్యపరచింది. అదే సమయంలో లోగాన్‌ మరో ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ను చూసి అందరూ షాక్‌కు గురయ్యారు.

బ్రిటన్‌ రాణి మరణం తర్వాత కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టిన ఆమె కుమారుడు ఛార్లెస్‌ మార్చి 28, 2026లో మరణిస్తారని లోగాన్‌ స్మిత్‌ పెట్టిన ట్వీట్‌ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇప్పటికే రాణిగారు పోయారనే బాధలో ఉన్నవారికి, కొత్త రాజు విషయంలో చెడువార్త ఆగ్రహం తెప్పించింది. పలువురు యూజర్లు లోగాన్‌ను హెచ్చరించడంతో పాటు ట్విట్టర్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

ట్విట్టర్‌ లోగాన్‌ స్మిత్‌ అకౌంట్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు నోటీసు కూడా ఇచ్చింది.. అయితే లోగాన్‌ చేసిన ట్వీట్స్‌ స్క్రీన్‌ షాట్లు రూపంలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి. కొందరైతే చావు పుట్టుకలు నిర్ణయించేది దేవుడు.. అలా చెప్పడానికి ఈ లోగాన్‌ ఎవరు అని మండిపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..