Mark Zuckerberg: జోబైడెన్‌ సర్కార్‌పై మెటా సీఈఓ జుకర్‌బర్గ్ విమర్శలు

|

Jan 12, 2025 | 10:58 AM

జోబైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వంపై మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంచలన ఆరోపణలు చేశారు. కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి పెట్టిన పోస్టులను తీసివేయాలని బైడెన్‌ సర్కార్‌ ఒత్తిడి తెచ్చిందని కామెంట్స్‌ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Mark Zuckerberg: జోబైడెన్‌ సర్కార్‌పై మెటా సీఈఓ జుకర్‌బర్గ్ విమర్శలు
Mark Zuckerberg
Follow us on

ద జో రోగన్‌ ఎక్స్‌పీరియన్స్‌ పాడ్‌కాస్ట్‌లో ఇంట్రిస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్‌ దుష్ఫ్రభావాల గురించి పోస్టులు తీసేయాలని ఒత్తిడి చేసిందని ఆరోపించారు. బైడెన్ ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకుని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించిందన్నారు. అయితే.. వ్యక్తిగతంగా తాను టీకాలకు అనుకూలంగా ఉంటానని.. వాటివల్ల ప్రతికూలత కంటే సానుకూల ఫలితాలే ఉంటాయని.. కానీ.. కొవిడ్ వ్యాక్సిన్స్‌ను తీసుకువచ్చే వేళ.. వాటి గురించి వినిపించిన వాదనలను సెన్సార్ చేసేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగించదన్నారు జుకర్‌బర్గ్‌. వ్యాక్సిన్స్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పే పోస్టులన్నీ తీసేయాలని, తన సోషల్‌ మీడియాలో అభ్యంతరకరంగా పరిగణించిన కంటెంట్‌ను సెన్సార్‌ చేయాలని వైట్‌హౌస్‌ సిబ్బంది నుంచి ఒత్తిడి వచ్చిందన్నారు. అందంతా హాస్యాస్పదంగా ఉండటమే కాక, అలా చేయకూడదని అనిపించేదని నాటి పరిస్థితులను జుకర్‌బర్గ్‌ గుర్తు చేశారు.

టైటానిక్‌ నటుడు లియోనార్డో డికాప్రియోపై వచ్చిన మీమ్‌ కూడా వారు తీసేయమన్న పోస్టుల్లో ఒకటని పేర్కొన్నారు. వ్యాక్సిన్ సైడ్‌ ఎఫెక్ట్స్‌తో కొన్నేళ్ల తర్వాత ప్రజలు పరిహారం పొందుతారేమో అన్నట్టుగా ఉన్న ఆ మీమ్ వైరల్ అయింది. మరోవైపు.. నకిలీ, హానికర సమాచార వ్యాప్తి కట్టడి కోసం అనుసరిస్తోన్న సెన్సార్‌షిప్ విధానాల్లో మెటా మార్పులు చేసినట్లు ఇటీవల జుకర్‌బర్గ్ ప్రకటించారు. సెన్సార్‌షిప్‌ అధిక స్థాయిలో ఉన్న పరిస్థితికి చేరుకున్నామని.. ప్రస్తుతం తాము తప్పులను తగ్గించుకోవడంపై దృష్టిపెడతామని చెప్పారు. తమ విధానాలను సరళీకరించి, అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో స్వేచ్ఛ, భావవ్యక్తీకరణను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటామంటూ జుకర్‌బర్గ్‌ ఓ వీడియో విడుదల చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి