విమానశ్రయంలో లగేజ్ పోయింది..గంటలోనే దొంగను గుర్తించిన ప్రయాణికుడు

|

Mar 31, 2023 | 9:27 PM

విమానశ్రయంలో కొన్నిసార్లు లగేజ్ కనిపించకుండా పోతుంది. దానిపై ఫిర్యాదు చేస్తే సామాను తిరిగి వచ్చేందుకు కొన్నిరోజులు పడుతుంది. అయితే ఓ వ్యక్తి తన తెలివితేటలతో గంటలోనే దొంగతనాన్ని ఛేదించాడు.

విమానశ్రయంలో లగేజ్ పోయింది..గంటలోనే దొంగను గుర్తించిన ప్రయాణికుడు
Luggage
Follow us on

విమానశ్రయంలో కొన్నిసార్లు లగేజ్ కనిపించకుండా పోతుంది. దానిపై ఫిర్యాదు చేస్తే సామాను తిరిగి వచ్చేందుకు కొన్నిరోజులు పడుతుంది. అయితే ఓ వ్యక్తి తన తెలివితేటలతో గంటలోనే దొంగతనాన్ని ఛేదించాడు. వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన జమీల్ రీడ్ అనే వ్యక్తి లాస్ ఏంజెల్స్ నుంచి జార్జియాలోని అట్లాంటాకు ప్రయాణించడానికి ఎయిర్ పోర్ట్ కు వెళ్లాడు. బ్యాగేజ్ కార్సెల్ పై చూడగా అతని బ్యాగ్ కనిపించలేదు. చివరికి తన బ్యాగ్ చోరికి గురైనట్లు గుర్తించాడు. అయితే తన బ్యాగులో ఎయిర్ టాగ్ ఉండటంతో లగేజ్ ను ట్రాక్ చేస్తూ దాని కదలికలు గమనించాడు.

 

అయితే తన లగేజ్ దొంగిలించిన నిందితుడు ఎయిర్ పోర్టుకు వస్తుండటాన్ని గమనించిన పోలీసులకు సమాచారం అందించాడు. వారితో ఉండగానే నెల్సన్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాడు. అయితే నెల్సన్ తన దుస్తులే వేసుకోవడాన్ని చూసి జమీల్ అవాక్కయ్యాడు. ఆ లగేజ్ తనదేనని ముందు నెల్సన్ పోలీసులకు నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ జమీల్ దుస్తులు ధరించడంతో దొరికిపోయాడు. చివరికి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకోన్నారు. ఆ బ్యాగులో సుమారు 2.4 లక్షలు విలువైన వస్తువులున్నట్లు జమీల్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..