హాంకాంగ్ విమానాశ్రయంలో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో గ్రౌండ్ వర్కర్ మృతి చెందాడు. బాధితుడు 34 ఏళ్ల జోర్డాన్ జాతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరు వెల్లడించలేదు. అతను టో ట్రక్ ప్యాసింజర్ సీటులో ప్రయాణిస్తుండగా, అతడు కింద పడిపోయాడు.. అంతలోనే రన్‌వేపైకి వస్తున్న విమానం అతన్ని ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. మంగళవారం తెల్లవారుజామున టాక్సీవేపై తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని ఎమర్జెన్సీ సర్వీస్ గుర్తించారు. ఈ అసాధారణ సంఘటనకు కారణమైన ప్రమాదకరంగా డ్రైవ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు.
నివేదికల ప్రకారం, మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన గాయాలతో టాక్సీవేపై పడి ఉన్న బాధితుడిని అత్యవసర విభాగం కార్మికులు గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. దురదృష్టవశాత్తు, అతను సంఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు. వాహనంలో సిబ్బంది ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్టు బిగించకుండా వదిలేసి ఉండొచ్చని హాంకాంగ్ ఎయిర్‌పోర్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ తో వ్యక్తి మరణానికి కారణమైన వాహనం నడిపిన 60 ఏళ్ల డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ షాకింగ్ సంఘటన విమానాశ్రయంలో గ్రౌండ్ స్టాఫ్ అనుసరించే సేఫ్టీ ప్రోటోకాల్స్‌పై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని అధికారులను ఆదేశించేలా చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..