రియల్ స్పైడర్ మ్యాన్.. గంటలో 58 అంతస్తుల బిల్డింగ్ అవలీలగా ఎక్కేశాడు.. వీడియో వైరల్..
యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అభిమానులను సొంతం చేసుకుంది స్పైడర్ మ్యాన్ సీరిస్. తాజాగా ఓ యూట్యూబర్ చేతులతో గంటల వ్యవధిలో 58 అంతస్తుల
యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అభిమానులను సొంతం చేసుకుంది స్పైడర్ మ్యాన్ సీరిస్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సీరిస్‌కు ఉన్న క్రేజ్ మాములు కాదు. అయితే తాజాగా ఓ యూట్యూబర్ చేతులతో గంటల వ్యవధిలో 58 అంతస్తుల బిల్డింగ్‌ను చకచక ఎక్కేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రియల్ స్పైడర్ మ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. అథ్లెట్ లియో అర్బన్ శనివారం ఎలాంటి భద్రతా సామాగ్రి లేకుండా కేవలం తన చేతులతో పారిస్ మోంట్ పార్నాస్సేలోని 58 అంతస్తుల భవనాన్ని ఎక్కాడు. అర్బన్ ఆ బిల్డింగ్‌ను కేవలం గంటలోపే సులువుగా ఎక్కేశాడు. అతడు చేసిన ఈ సాహసాన్ని అక్కడున్నవాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కాగా అర్బన్ గతంలో ఈఫిల్ టవర్, టూర్ టీ1, అరియాన్ ఆకాశహర్మ్యాలు అధిరోహించాడు. తాజాగా ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో 210 మీటర్ల ఎత్తైన భవనాన్ని ఎక్కిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫీట్ చేయడానికి ముందు తాను ఎన్నో వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానని.. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన ఫీట్ ఇదేనని అర్బన్ తెలిపాడు.
Il y a quelqu’un sur #Montparnasse pic.twitter.com/dsIjtbQ76f
— Jérémy Descours (@JeremyDescours) December 5, 2020