Hijab: జట్టు కత్తిరించి.. హిజాబ్ లు కాలుస్తూ.. ఆదేశంలో మహిళల వినూత్న నిరసన..

ఇరాన్ లో హిజాబ్ ధరించకపోవడంతో ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పోలీసు కస్టడీలో ఉండగానే ఆమె మృతి చెందడంపై ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు రోడ్లపైకి ఆందోళనలు చేస్తున్నారు. కొంతమంది మహిళలు..

Hijab: జట్టు కత్తిరించి.. హిజాబ్ లు కాలుస్తూ.. ఆదేశంలో మహిళల వినూత్న నిరసన..
Protest Aganist Hijab

Updated on: Sep 19, 2022 | 1:23 PM

Hijab: ఇరాన్ లో హిజాబ్ ధరించకపోవడంతో ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పోలీసు కస్టడీలో ఉండగానే ఆమె మృతి చెందడంపై ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు రోడ్లపైకి ఆందోళనలు చేస్తున్నారు. కొంతమంది మహిళలు వినూత్న రీతిలో తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవల హిజాబ్ ధరించలేదని మహ్స అమినీ అనే 22 ఏళ్ల అమ్మాయిని మోరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. ఈ ఘటనపై ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మహ్సా అమినీ చనిపోయిందని మహిళలు ఆరోపిస్తు్న్నాయి. ఇరాన్ లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే చట్టం ఉంది. అయితే తాజాగా మహ్సా అమిని మరణం తర్వాత పెద్ద సంఖ్యలో అక్కడి మహిళలు బయటికొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ మహిళలు ఇప్పటికే నిరసనల్లో పాల్గొంటుండగా తాజాగా కొందరు మహిళలు మహ్సా అమిని మృతికి నిరసనగా తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు. హిజాబ్ లను తగలబెడుతున్నారు. తమ పట్ల కఠినంగా అమలుపరుస్తున్న చట్టాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జుట్టును కట్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే హిజాబ్ లు సైతం కాలుస్తూ తమ నిరసన తెలుపుతున్నారు.

టెహ్రాన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు ఇరాన్ లో మహ్స అమినీ మృతిపై రోజురోజుకు మిన్నంటుతున్న ఆందోళనను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలనుపయోగించి ఆందోళనలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మహ్సా అమిని తన కుటుంబంతో కలిసి ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సందర్శనకు వెళ్లింది. ఆ దేశ మహిళలు కఠినమైన దుస్తుల కోడ్‌ పాటించేలా బాధ్యత వహించే పోలీసులు ఆమె హిజాబ్‌ ధరించకపోవడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం సెప్టెంబర్ 13వ తేదీన ఆ యువతిని అరెస్ట్‌ చేశారు. అయితే మోరాల్టీ పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె మూడు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించగా ఆ యువతి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటన ఇరాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్‌ కోడ్‌ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ యువతి కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులతోపాటు మహిళలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈవిషయంపై నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..