AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driver Stops Train: పెరుగు ప్యాకెట్ కోసం మధ్యలోనే రైలును ఆపిన లోకోపైలట్.. ఆ తరువాత ఏం చేశాడంటే..!

Train Loco Pilot: బస్సులో గానీ, కారులో గానీ సుదూర ప్రయాణం చేస్తున్నట్లయితే మధ్యలో ఎక్కడైనా ఆపేందుకు ఆస్కారం ఉంటుంది. అది డ్రైవర్ చేతిలో పని. ఆకలేసినా..

Driver Stops Train: పెరుగు ప్యాకెట్ కోసం మధ్యలోనే రైలును ఆపిన లోకోపైలట్.. ఆ తరువాత ఏం చేశాడంటే..!
Pak Train Driver
Shiva Prajapati
|

Updated on: Dec 09, 2021 | 12:02 PM

Share

Train Loco Pilot: బస్సులో గానీ, కారులో గానీ సుదూర ప్రయాణం చేస్తున్నట్లయితే మధ్యలో ఎక్కడైనా ఆపేందుకు ఆస్కారం ఉంటుంది. అది డ్రైవర్ చేతిలో పని. ఆకలేసినా.. ఇతర సమస్యలున్నా రోడ్డుపై ఎక్కడో చోట మధ్యలో ఆపే వెసులుబాటు ఉంటుంది. మరి ట్రైన్‌ను మధ్యలో కాసేపు ఆపగలమా? మన అవసరం కోసం ట్రైన్‌ను నిలిపివేయగలమా? అంత అవకాశం ఉంటుందా? అంటే ఉంటుందని చేసి చూపించాడు ట్రైన్ డ్రైవర్(లోకోపైలట్). పెరుగు తినాలనిపించి ఏకంగా ట్రైన్‌ను మధ్యలోనే నిలిపివేశాడు. అయితే, ఇది ఇండియాలో జరుగలేదులేండి. పాకిస్తాన్‌లో ఈ ఘటన వెలుగు చూడగా.. ఆ తరువాత విషయం తెలుసుకున్న అధికారులు ఆ లోకోపైలట్‌ను సస్పెండ్ చేశారు.

వివరాల్లోకెళితే.. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సిటీ ట్రైన్ లాహోర్‌ నుంచి కరాచీ వైపు వెళ్తోంది. అయితే, ట్రైన్ డ్రైవర్ పెరుగు కోసం ట్రైన్‌ను మధ్యలో నిలిపివేశాడు. స్టేషన్‌లోని ఓ షాపు నుంచి పెరుగు ప్యాకెట్ తీసుకుని తిరిగి ట్రైన్ ఎక్కాడు. అయితే, ఇదంతా వీడియో రికార్డ్ చేసిన పలువురు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను బేస్ చేసుకుని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కారణంగానే.. రైల్వేల భద్రత, నియంత్రణపై అపోహలు నెలకొంటున్నాయని, అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు నెటిజన్లు.

‘‘సాధారణంగా రైలును మధ్య ఆపడం అనేది భద్రతా సమస్యగా పరిణమిస్తుంది. భద్రత మా తొలి ప్రాధాన్యత. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. నిర్లక్ష్యాన్ని మేం అస్సలు సహించబోము. సదరు రైలు లోకో పైలట్‌ను సస్పెండ్ చేస్తున్నాం.’’ అని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ ఇజాజ్-ఉల్-హసన్ షా ప్రకటించారు. కాగా, పాకిస్తాన్‌లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అని, పర్యవేక్షణ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని రైల్వే అధికారి ఒకరు చెబుతున్నారు. జూన్ నెలలో వ్యవసాయ భూముల గుండా వెళుతున్న ఓ రైలు పట్టాలు తప్పి మరో సర్వీస్ ట్రైన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 60 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

Also read:

Minsiter KTR: బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్.. తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..

Best Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ఇక్కడ తెలుసుకోండి..!

Shocking News: వేప పుల్ల కోసం వెళ్తే ప్రాణాలే పోయాయి.. మరొకరు మృత్యువుకు హాయ్ చెప్పి వచ్చారు..!