Covid 19: నిమ్మకాయలపై కన్నేసిన ‘డ్రాగన్’ దేశం.. అదే కారణమంటున్న చైనా రైతులు..
గత కొన్ని నెలలుగా చైనాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రజలు వ్యాధి సహజ నివారణ పద్దతుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ దేశంలో నిమ్మకాయలకు భారీగా డిమాండ్..

గత కొన్ని నెలలుగా చైనాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రజలు వ్యాధి సహజ నివారణ పద్దతుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ దేశంలో నిమ్మకాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. 2019లో మొదటిసారిగా చైనాలో కోవిడ్ 19 కేసు నమోదయిన నాటి నుంచి అక్కడి ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని అమలుచేసింది. అయితే కొన్ని నెలల క్రితం ఆ విధానాన్ని సడలిండంతో కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. టీకాలతో పనికాదనుకోవడమో, లేక మరేదైన కారణంగానో తెలియడం లేదు కానీ ఆ దేశంలోని ప్రజలు కోవిడ్ నివారణ కోసం సహజ నివారణ పద్దతులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా బీజింగ్, షాంఘై వంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా నిమ్మకాయలకు భారీగా డిమాండ్ పెరిగింది.
అయితే ఆ దేశంలోని వార్తాసంస్థల నివేదికల ప్రకారం అర కిలో నిమ్మకాయల ధర ఒకప్పుడు 2 యువాన్లుగా ఉండగా ఇప్పుడు అవి రూ. 6 యువాన్లుగా ధర పలుకుతున్నాయి. కరోనా బారి నుంచి బయటపడేందుకు, ఇంకా రోగనిరోధక శక్తి పెరగడానికి విటమిన్ సీ ఉపకరిస్తుందని అక్కడి ప్రజలు నమ్మడమే ఇందుకు కారణంగా చెబుతున్నాయి ఆ దేశ వార్తాకథనాలు. అందుకే రోజుకు 20 నుంచి 30 టన్నుల నిమ్మకాల విక్రయాలు పెరిగాయని చైనా రైతులు అంటున్నారు. గతంలో కేవలం 5 నుంచి 6 టన్నులు మాత్రమే అమ్ముడయ్యేవని వారు చెబుతున్నారు. కేవలం నిమ్మకాయలే కాక తాజా కూరగాయాలు, బేర్రీ, నారింజ, పీచెస్ వంటివాటికి కూడా భారీగా డిమాండ్ పెరిగిందని చైనా రైతులు అంటున్నారు.
కాగా, గడిచిన ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చైనా, జపాన్‌లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేలా మారింది. ఇక చైనాలో వేలాది మంది ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోక పేషెంట్లు వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోతున్నారు. ఇంకా చైనాలో ఎక్కడ చూసినా ఆస్పతి మార్చురీల్లో శవాలు పేరుకుపోతున్నాయి. ఈ తరుణంలోనే ఆ దేశంలో ఒక్కసారిగా నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిపోయింది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.