ఇండియన్స్‌ని చూసి నేర్చుకోండి.. ఇమ్రాన్ నోట.. ‘ భారత ‘ ప్రశంస

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోట భారత ‘ ప్రశంస ‘.. కనీవినీ ఎరుగని వింత ! గతంలో ఏనాడూ ముఖ్యంగా ఇండియా పట్ల ఆయన ఇంతగా స్పందించని తీరు ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను , అలాగే ఫారిన్ లో సెటిలైన చైనీయులను చూసి విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయులు నేర్చుకోవలసింది ఎంతో ఉందని అన్నారాయన. వారు తమ మాతృదేశాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, అవినీతి రహిత వ్యవస్థతో తమ దేశాల […]

ఇండియన్స్‌ని చూసి నేర్చుకోండి.. ఇమ్రాన్ నోట.. ' భారత ' ప్రశంస
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 14, 2019 | 3:11 PM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోట భారత ‘ ప్రశంస ‘.. కనీవినీ ఎరుగని వింత ! గతంలో ఏనాడూ ముఖ్యంగా ఇండియా పట్ల ఆయన ఇంతగా స్పందించని తీరు ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను , అలాగే ఫారిన్ లో సెటిలైన చైనీయులను చూసి విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయులు నేర్చుకోవలసింది ఎంతో ఉందని అన్నారాయన. వారు తమ మాతృదేశాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, అవినీతి రహిత వ్యవస్థతో తమ దేశాల ఎకానమీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇటీవల తమ దేశం ‘ అవినీతి రహిత దినోత్సవాన్ని ‘ (యాంటీ కరప్షన్ డే) పాటించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. పాకిస్తాన్ గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతిని ఎదుర్కొంటోందని, కానీ విదేశాల్లో నివసిస్తున్న మన జాతీయులు మాత్రం విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి వల్ల తలెత్తే పరిణామాలను వారు ఊహించలేకపోతున్నారని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాతృ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో తెలియడంలేదన్నారు. అలాగే చైనీయులు కూడా తమ దేశ అభివృధ్ది కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ‘ ‘ మీరు (విదేశాల్లోని పాకిస్తానీయులు ) మనకు పెద్ద ఎసెట్.. నేను సదా మీకు సన్నిహితంగానే ఉంటున్నాను. కానీ పెట్టుబడులు పెట్టేందుకు మీరు ఎందుకు సందేహిస్తున్నారు.. ఎందుకు విముఖత చూపుతున్నారు ? ఇక్కడ అవినీతి, లంచగొండులు పెరిగిన కారణంగానేనా ? ‘ అని ఇమ్రాన్ ప్రశ్నించారు.

ఇండియన్ ఎకానమీ వృద్దిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ఉంది. వరల్డ్ లో భారత పెట్టుబడులు అత్యధికమని ప్రపంచ బ్యాంకు గుర్తించింది. గత ఏడాది ఇది దాదాపు 78 బిలియన్ డాలర్ల మేర ఉంది.. ఆ తరువాత చైనా, మెక్సికో 67, 36 బిలియన్ డాలర్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తమ దేశంలో అవినీతిపై ప్రకటించిన యుధ్ధాన్ని గుర్తు చేస్తున్నా అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. చైనాలో అవినీతికి పాల్పడిన 500 మందికి జిన్ పింగ్… జైలు శిక్షలు విధించారని ఆయన చెప్పారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..