బ్రిటన్ ఎన్నికల్లో ఎన్నారైల హవా.. పాత కొత్తల మేలు కలయిక

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నారైల హవా స్పష్టంగా కనిపించింది. ఇటు కన్సర్వేటివ్, అటు లేబర్ పార్టీల నుంచి పలువురు విజయం సాధించారు. భారత సంతతి ఎన్నారైలలో చాలామందిని విజయం వరించింది. కొత్త ముఖాలతో బాటు సుమారు డజను మంది పాత ఎంపీలు గెలుపొందారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ ఘన విజయం సాధించడంతో.. ఇక నూతన సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి మార్గం సుగమమైంది. ఈ ఎన్నికల్లో ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి […]

బ్రిటన్ ఎన్నికల్లో ఎన్నారైల హవా.. పాత కొత్తల మేలు కలయిక
Follow us

|

Updated on: Dec 14, 2019 | 1:22 PM

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నారైల హవా స్పష్టంగా కనిపించింది. ఇటు కన్సర్వేటివ్, అటు లేబర్ పార్టీల నుంచి పలువురు విజయం సాధించారు. భారత సంతతి ఎన్నారైలలో చాలామందిని విజయం వరించింది. కొత్త ముఖాలతో బాటు సుమారు డజను మంది పాత ఎంపీలు గెలుపొందారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ ఘన విజయం సాధించడంతో.. ఇక నూతన సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి మార్గం సుగమమైంది. ఈ ఎన్నికల్లో ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ 36,693 ఓట్లతో గెలు[పొందారు. (కన్సర్వేటివ్ పార్టీ తరఫున నార్త్ యాంక్ షైర్ లోని రిచ్ మండ్ నుంచి ఈయన పోటీ చేశారు).

బోరిస్ జాన్సన్ కొత్త మంత్రివర్గంలో సునక్ మంత్రి అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక కన్సర్వేటివ్ పార్టీ నుంచే గగన్ మహీంద్రా, నవేంద్రు మిశ్రా విజయం సాధించగా.. బ్రిటన్ మాజీ హోం కార్యదర్శి ప్రీతి పటేల్ మళ్ళీగెలుపొందారు. స్టాక్ పోర్ట్ నియోజకవర్గంలో నవేంద్రు మిశ్రా తొలిసారి విజయం సాధించడం విశేషం. ఇక తొలి బ్రిటిష్ సిక్కు మహిళా ఎంపీగా గత ఎన్నికల్లో గెలుపొందిన ప్రీత్ కౌర్ గిల్… బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ నియోజకవర్గాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఇంకా… తన్ మంజిత్ సింగ్ దేశీ, వీరేంద్ర శర్మ , సీమా మల్హోత్రా , వలెరీ వాజ్ తదితరులు ఈ ఎన్నికల్లో భారత ‘ వర్ణాన్ని ‘ చూపారు. నిజానికి బోరిస్ జాన్సన్ తన గత ప్రభుత్వంలో కూడా ఎన్నారైలకు అత్యంత ప్రాధాన్యం ఇఛ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అయన అదే పంథాను అనుసరించనున్నట్టు తెలుస్తోంది.