కాబూల్ విమానాశ్రయ సమీపంలో ఆఫ్ఘన్ల దీనావస్థ హృదయాలను కలచివేస్తోంది. వందలాది ఆఫ్ఘన్లు మోకాలిలోతు డ్రైనేజీ నీటిలోనే నిలబడి తమ చేతుల్లోని పత్రాలను పైకి ఎత్తిచూపుతూ .. తమను ఎయిర్ పోర్టులోకి అనుమతించాలని అమెరికన్ దళాలను కోరుతున్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి తరలించాలని వారు వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వారి దురవస్థను కళ్ళకు కడుతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ఎలాగైనా సహాయ పడాలని వారు కోరుతున్నారు. ఆగస్టు 31 డెడ్ లైన్ దగ్గరపడుతున్న కొద్దీ వారిలో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తక్కువ సంఖ్యలో ఉన్న అమెరికా, బ్రిటన్ బలగాలు కూడా వెళ్ళిపోతే ఇక తమకు దిక్కెవరని వారు ఆక్రోశిస్తున్నారు. ఈ డెడ్ లైన్ ని పొడిగించేది లేదని అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ ఖరాఖండిగా చెబుతున్నారు. ఆయనకు నచ్చజెప్పేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విమానాశ్రయానికి ఆఫ్ఘన్లు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అయితే విదేశీయులను తాము అనుమతిస్తున్నామని తాలిబన్ల అధికార ప్రతినిధి జైబుల్లా ముజాహిదీ మీడియాకు తెలిపారు.
ఎయిర్ పోర్టు చేరుకుంటున్న ఆఫ్ఘన్లు తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోవాలని వారిని తాము కోరుతున్నామన్నారు. విమానాశ్రయానికి దారి తీసే రోడ్డును మూసివేశామని. ఆఫ్ఘన్లు ఇక వెళ్లజాలరని ఆయన చెప్పారు. ఇలా ఉండగా తాలిబన్ల రాక్షస కృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల సాయుధులైన వ్యక్తులు తమను తాలిబన్ ఫైటర్లుగా చెప్పుకుంటూ ఇళ్ల తలుపులు తట్టి లోపలికి ప్రవేశించి ఇళ్లలోని సొమ్ము, జువెల్లరీని, కార్లు..ఇతర వాహనాలను దొంగిలించుకుపోతున్నారని అనేకమంది ఆఫ్ఘన్లు చెబుతున్నారు. 15 ఏళ్ళు అంతకన్నా వయస్సు పైబడిన యువతులు, మహిళలను వారు తమ వెంట బలవంతంగా తీసుకువెళ్లిపోతున్నారని తెలుస్తోంది. తన 24 ఏళ్ళ కూతురిని ఓ తాలిబన్ ఫైటర్ కి ఇచ్చి పెళ్లి చేస్తామంటూ తీసుకువెళ్లారని, అయితే ఆ తరువాత ఆమెపై నలుగురు అత్యాచారం చేశారని ఓ తండ్రి వాపోయాడు. చివరకు చిన్న పిల్లలను కూడా తాలిబన్లు హతమారుస్తున్నారని ఐరాస సభ్యుడొకరు చెప్పినట్టు ఓ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది.
Devastating scenes at Kabul airport. Knee deep in sewage, waving their papers, begging to be let in. @ABC #Kabul #Taliban #Afghanistancrisis pic.twitter.com/BZccCe1vu8
— Ian Pannell (@IanPannell) August 25, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: తరుముకొస్తున్నథర్డ్ వేవ్..! హెచ్చరిస్తున్నా కేంద్ర ఆరోగ్య శాఖ..: Third Wave Of Coronavirus Live Video.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల…: TS EAMCET Result 2021 Live Video.
కన్నింగ్ లేడీ.. హనీట్రాప్ కేసులో కీలకం.. ముగ్గురి పేర్లతో ఒకే యువతి మోసం..:Honeytrap Case Video.