ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో.. భారత-కెనడాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే హర్‌దీప్ సింగ్ హత్య కేసుకు సంబంధించి అమెరికాకు చెందిన ఓ పత్రిక సంచలన కథనాన్ని ప్రచూరించింది. ఈ హత్యకు సంబంధించిన వీడియోను తాము చూశామని.. వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడించింది. అయితే సమీపంలో ఉన్నటువంటి సీసీటీవి నుంచి అసుల ఈ ఫుటేజీ లభించలేదని పేర్కొంది. అయితే ఈ ఫుటేజీలో దుండగులు రావడం.. నిజ్జర్‌ను తుపాకితో కాల్చడం, ఆ తర్వాత తాపీగా వెళ్లిపోయిన దృశ్యాలు నిక్షిప్తమైపోయినట్లు పేర్కొంది. అయితే దాదాపుగా 90 సెకన్ల పాటు నిడివి ఉన్నటువంటి ఆ వీడియోలో నిజ్జర్ వినియోగించే గ్రేకలర్ పికప్ ట్రక్, ఓ తెల్లటి సెడాన్ కారు పక్కపక్కనే సమాంతరంగా ప్రయాణిస్తున్నట్లు కనిపించిందని పేర్కొంది.
అయితే అంతలోనే సెడాన్ కారు వేగంగా వచ్చి పికప్ ట్రక్ ఎదురుగా వచ్చి ఒక్కసారిగా ఆగిపోయినట్లు చెప్పింది. ఆ సమయంలోనే హుడెడ్ స్వెట్ షర్ట్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న ఆయుధాలతో నిజ్జర్ ఉన్న పికప్ ట్రక్ వద్దకు వచ్చారని తెలిపింది. అలాగే మరోవైపు ఆ సెడాన్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజి నుంచి డ్రైవర్ సీట్‌లో ఉన్న వ్యక్తిపై తూటాల వర్షం కురిపించినట్లు వెల్లడించింది. మొత్తంగా 50 తూటాలను కాల్చగా.. వీటిల్లో దాదాపు 34 తుటాలు నిజ్జర్ శరీరం లోకి దూసుకెళ్లినట్లు పేర్కొంది. అయితే ఈ దాడి జరిగిన అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు కూడా సెడాన్ కారు వెళ్లినటువంటి వైపుగా వేగంగా పరిగెత్తినట్లు పేర్కొంది. అలాగే ఈ ఘటన రాత్రి 8.27 PM సమయంలో చోటు చేసుకున్నట్లు చెప్పింది. అయితే సమీపంలోని ఉన్న ఓ మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్న భూపిందర్‌జీత్ సింగ్ అనే వ్యక్తి ఘటనా స్థలానికి పరిగెత్తుకొంటూ వచ్చారని.. అయితే ఆ సమయానికే నిజ్జర్ కారులో అచేతనంగా పడి ఉన్నట్లు తెలిపింది.
దీంతో సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారని.. అయితే ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కెనడా రాయల్ మౌంటెడ్ పోలీసు, సర్రే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ బృందం మధ్య కొద్ది సేపు వాదనలు కూడా జరిగినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. నిజ్జర్ హత్య భారత్-అమెరికా మధ్య తీవ్రమైన దౌత్య వివాదానికి దారి తీసినటువంటి తరుణంలో తాజాగా వాషింగ్టన్ పోస్టు ఈ కథనాన్ని ప్రచురించడం చర్చనీయాంశంగా మారింది. మరో విషయం ఏంటంటే అవసరమైతే తప్ప భారత పర్యటన చేయకూడదని.. తమ దేశ పౌరులకు కెనడా ప్రభుత్వం సోమవారం కూడా రెండోసారి ఆదేశాలు జారీ చేసింది. అలాగే సోషల్ మీడియాలో కెనడాపై తీవ్రంగా వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని.. అలాగే కొందరు ఆందోళనలకూ సైతం పిలుపునిస్తున్నారని చెప్పింది. అందుకే భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని తమ దేశ పౌరులకు సూచనలు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..