US Elections: అమెరికా అధ్యక్షఎన్నికల్లో రంగు రగడ.. కమలా హ్యారిస్‌ ఐడెంటిటీని ప్రశ్నిస్తున్న ట్రంప్‌ బృందం

|

Aug 09, 2024 | 9:42 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో స్కిన్‌ కలర్‌ ఫైట్‌ మొదలైంది. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ మధ్య రంగు రగడ చర్చగా మారుతోంది. కమలా హ్యారిస్‌ మూలాలను, ఆమె ఐడెంటిటీని రిపబ్లికన్లు ప్రశ్నిస్తున్నారు.

US Elections: అమెరికా అధ్యక్షఎన్నికల్లో రంగు రగడ.. కమలా హ్యారిస్‌ ఐడెంటిటీని ప్రశ్నిస్తున్న ట్రంప్‌ బృందం
Donald Trump, Kamala Harris
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో స్కిన్‌ కలర్‌ ఫైట్‌ మొదలైంది. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ మధ్య రంగు రగడ చర్చగా మారుతోంది. కమలా హ్యారిస్‌ మూలాలను, ఆమె ఐడెంటిటీని రిపబ్లికన్లు ప్రశ్నిస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన మద్దతుదారులు, వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. తాను హిందూ ఆలయాలకు వెళ్లేదాన్ననీ, అలాగే నల్లజాతీయుల చర్చికి కూడా వెళ్లేదాన్నంటూ లాస్‌ ఏంజెలిస్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలా హ్యారిస్‌ చెప్పారు. ఈ పరిస్థితుల్లో కమలాహ్యారిస్‌ ఐడెండిటీపై అమెరికాలో చర్చ నడుస్తోంది. భారతీయ వస్త్రధారణతో హ్యారిస్‌ ఉన్న ఒక ఫొటోను ట్రంప్‌ షేర్‌ చేశారు.

తన ఐడెండిటీ గురించి కమలా హ్యారిస్‌ చేసిన వ్యాఖ్యలకు ట్రంప్‌ స్పందించిన తీరు కూడా విమర్శలకు కారణమైంది. తాను రెండు జాతులకు చెందిన వ్యక్తినని కమలా హ్యారిస్‌ చెప్పడాన్ని ట్రంప్‌ తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యలు రెండు జాతులను అగౌరవపరచడమేనని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన కమలా హ్యారిస్‌, ఇక డొనాల్డ్‌ ట్రంప్ ముఖాముఖికి రెడీ అవుతున్నారు. ఇద్దరి మధ్య తొలి డిబేట్‌కు ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్‌ పదో తేదీన వీరిద్దరూ తొలి చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే రంగు రచ్చ వీరి మధ్య చర్చకు వస్తుందా అన్నదే అసలు పాయింట్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..