అమెరికాకు చెందిన జొనాథన్ మా(Jonathan Ma) అనే వ్యక్తి క్షణాల వ్యవధిలోనే కోట్లు సంపాందించాడు. కేవలం 42 సెకన్లలోనే రూ.1.75 ఆర్జించి కోటీశ్వరుడయ్యాడు. క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీ అయిన నాన్-ఫంగబుల్ టోకెన్(NFT)లతో సెకన్ల వ్యవధిలో ఈ మొత్తాన్ని సంపాదించి.. ఓవర్నైట్సెన్సేషన్గా మారాడు ఈ యూట్యూబర్. కాలిఫోర్నియాకు చెందిన ఈ యువ యూట్యూబర్ జొనాథన్.. ‘జోమా టెక్’ పేరుతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టో కరెన్సీ, టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఆయన ఛానెల్‌కు 16 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో ‘వ్యాక్సీడ్ డాగ్గోస్’ పేరుతో ఎన్ఎఫ్టీ కలెక్షన్‌ను విడుదల చేశారు. ఇదే ఆయనకు 2,34,000 డాలర్లు తెచ్చి పెట్టింది. అంటే ఆ మొత్తం భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.75 కోట్లు ఉండటం విశేషం. అది కూడా కేవలం 42 సెకన్లలోనే రావడం ఆశ్చర్యపరుస్తోంది. సినిమాలకు దర్శకత్వం వహించాలనే తన కలను ఈ డబ్బులతో తీర్చుకుంటానని జొనాథన్ ఆనందం వ్యక్తం చేశారు.
డిజిటల్ కళాకృతిని బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ రూపంలో నిల్వ చేయడాన్ని ఎన్ఎఫ్‌టీ అంటారు. అలా జొనాథన్ తన ఎన్‌ఎఫ్‌టీ సేకరణను విడుదల చేశారు. అతను ఎన్‌ఎఫ్‌టీ సేకరణల కోసం డిస్కార్డ్ సర్వర్‌ని నిర్మించారు. జొనాథన్ ఎన్ఎఫ్‌టీని కలిగి ఉన్న ఎవరైనా దానిని ప్రైవేట్ డిస్కార్డ్‌లో చూడగలరు. ఎన్ఎఫ్టీలను ఉపయోగించి ఫొటోలు, వీడియోలు, ఆడియో ఇతర రకాల ఫైల్స్ దాచుకోవచ్చు. డాప్ రాడార్ ప్రకారం గతేడాది 18 వేల కోట్లకు పైగా ఎన్‌ఎఫ్‌టీలు అమ్ముడయ్యాయి.
Also Read
Ram Charan : నయా లుక్‌తో రచ్చ చేస్తున్న మెగాపవర్ స్టార్.. ఆ సినిమా కోసమేనా..
అతనో మోటివేషనల్ స్పీకర్.. చేసింది తెలిస్తే మాత్రం షాక్ అవడం పక్కా