AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Hamas War: భారత్ కలల ప్రాజెక్టును ఆపడానికి హమాస్ దాడి.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన

Israel Hamas War Update: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. భారత్ కలల ప్రాజెక్టును ఆపడానికి హమాస్ దాడికి కారణం అని అన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా భారత్‌-పశ్చిమ ఆసియా-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (ఐఎంఈఈసీ)పై చేసిన ప్రకటన హమాస్‌ దాడికి ఒక కారణమని ఆయన అన్నారు. ఈ కారిడార్ మొత్తం ప్రాంతాన్ని రైల్వే నెట్‌వర్క్‌కు కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రాంతాన్ని రైల్వే నెట్‌వర్క్‌కు కలుపుతుంది. అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడుల్లో 1,400 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు.

Israel Hamas War: భారత్ కలల ప్రాజెక్టును ఆపడానికి హమాస్ దాడి.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన
American President Joe Bide
Sanjay Kasula
|

Updated on: Oct 26, 2023 | 3:49 PM

Share

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక ప్రకటన చేశారు. భారత్ కలల ప్రాజెక్టును ఆపడానికి హమాస్ దాడి చేసిందని పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా భారత్‌-పశ్చిమ ఆసియా-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (ఐఎంఈఈసీ)పై చేసిన ప్రకటన హమాస్‌ దాడికి ఒక కారణమని ఆయన అన్నారు. ఈ కారిడార్ మొత్తం ప్రాంతాన్ని రైల్వే నెట్‌వర్క్‌కు కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రాంతాన్ని రైల్వే నెట్‌వర్క్‌కు కలుపుతుంది.

అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడుల్లో 1,400 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. ఈ దాడి తర్వాత హమాస్‌పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ప్రతీకార చర్యను ప్రారంభించింది. ఇద్దరి మధ్య ఇంకా యుద్ధం నడుస్తోంది.

అమెరికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి విలేకరుల సమావేశంలో బిడెన్ ఈ ప్రకటన చేశారు.  ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో బిడెన్ మాట్లాడుతూ.. ” హమాస్ దాడికి ఇది కూడా ఒక కారణమని నేను నమ్ముతున్నాను. దీనికి నా దగ్గర ఎలాంటి రుజువు లేదు. కానీ నా మనస్సాక్షి చెబుతోంది. ఇజ్రాయెల్ కోసం ప్రాంతీయ సమైక్యత, మొత్తం ప్రాంతీయ సమైక్యత కోసం మేము చేసిన కృషి కారణంగా, హమాస్ ఈ దాడికి పాల్పడింది. మేము దాడికి పాల్పడినవారిని వదిలిపెట్టలేం.  మేము ఈ ప్రాజెక్ట్‌ను వదిలిపెట్టలేం.. కొనసాగిస్తాం.”

వారంలో రెండోసారి ఈ ఆందోళన..

హమాస్ దాడికి జో బిడెన్ ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)ని ఒక వారంలోపే ప్రస్తావించడం ఇది రెండోసారి. చాలా మంది ఈ ఆర్థిక కారిడార్‌ను చైనా BRI ప్రాజెక్ట్‌కు ప్రత్యామ్నాయంగా కూడా చూస్తున్నారు. ఇది అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా దేశాలను సంయుక్తంగా కలుపుతుంది. సెప్టెంబరులో న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా భారత్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ కారిడార్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతంతో అనుసంధానించే తూర్పు కారిడార్, మరొక భాగం గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్‌తో అనుసంధానించే ఉత్తర కారిడార్.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి