బైడెన్‌ గెలుపు సంపూర్ణం.. ధ్రువీకరించిన ఎలక్టోరల్‌ కాలేజీ.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..

ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన పూర్తి ఫలితాలు వచ్చేశాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్..

బైడెన్‌ గెలుపు సంపూర్ణం.. ధ్రువీకరించిన ఎలక్టోరల్‌ కాలేజీ.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 16, 2020 | 7:54 AM

ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన పూర్తి ఫలితాలు వచ్చేశాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపు సంపూర్ణమైంది. అంతిమ విజయం బైడెన్‌దే అంటూ అమెరికా ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా ప్రకటించింది. బైడెన్‌కు 306 ఓట్లు దక్కాయని వెల్లడించింది. ఇక రిపబ్లికన్ పార్టీకి అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ 232 ఓట్లతో ఓడిపోయారంది. ఇదిలాఉండగా, 2021 జనవరి 20వ తేదీన అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎన్నో మలుపులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఓడిపోలేదని, అసలు విజయం తనదేనంటూ ట్రంప్ మొండిపట్టు పట్టారు. అధికారాన్ని వీడేది లేదంటూ భీష్మించారు. రీకౌంటింగ్ చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే ఆ కోర్టుల్లో ట్రంప్‌కు చుక్కెదురైంది. చివరికి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన ట్రంప్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. మరోవైపు అమెరికా ఎన్నికల సరళిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రరాజ్యంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇదే విధానం అంటూ పెదవి విరుస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంత సమయమా అంటూ నిట్టూరుస్తున్నారు.

Also read:

2021 సంవ‌త్స‌రానికి సంబంధించి ప్ర‌భుత్వ‌ సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్‌.. జాబితా విడుద‌ల‌

భారత్ – బ్రిటన్ టాక్స్…. 5 అంశాల్లో పరస్పర సహకారం… బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్…