The Railbus: ప్రపంచపు తొలి డ్యూయల్‌ మోడ్‌ వెహికల్.. స్పెషాలిటీ తెలిస్తే కంగుతింటారు

|

Dec 25, 2021 | 9:46 PM

ఒకసారి బస్సులా, మరోసారి రైలులా... రెండు విధాలుగా నడిచే సరికొత్త డీఎంవీ వాహనాన్ని రూపొందించింది జపాన్‌లోని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ.

The Railbus: ప్రపంచపు తొలి డ్యూయల్‌ మోడ్‌ వెహికల్.. స్పెషాలిటీ తెలిస్తే కంగుతింటారు
Dual Mode Vehicle
Follow us on

ఒకసారి బస్సులా, మరోసారి రైలులా… రెండు విధాలుగా నడిచే సరికొత్త డీఎంవీ వాహనాన్ని రూపొందించింది జపాన్‌లోని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ. ఇది రహదారుల పై బస్సు మాదిరిగానూ, రైల్వే పట్టాలపైన రైలులా అ‍త్యంత వేగంగా దూసుకుపోయే మొట్టమొదటి డ్యూయల్ మోడ్‌ వాహనం. ఈ వాహనం రోడ్డుపైన నడిచేటప్పుడు రబ్బరు టైర్లపై నడుస్తుంది. రైల్వే ట్రాక్‌ పైకి వచ్చేసరికి ఈ వాహనం ఆటోమెటిక్‌ అడ్జ్‌మెంట్‌ టెక్నాలజీతో ఇంటర్‌ చేంజ్‌ అయ్యి ఉక్కుచక్రాల సాయంతో రైలు బండిలా వెళ్లిపోతుంది. రహదారులకు, రైల్వే ట్రాక్‌లకు అనుగుణంగా దాని టైర్లు ఆటోమెటిక్‌ అడ్జెస్ట్‌ చేసుకుని ఆయా వాహానాల మాదిరిగా వేగవంతంగా వెళ్లటమే ఈ డ్యూయల్‌మోడ్‌ వాహనం ప్రత్యేకత. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్‌ మోడ్‌ వాహనాన్ని జపాన్‌లోని తోకుషిమా ప్రిఫెక్చర్‌లోని కైయో పట్టణంలో డిసెంబరు 25న బహిరంగంగా ప్రారంభించింది.

ఈ మేరకు ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ సీఈవో షిగేకి మియురా తక్కువ జనాభా ఉన్న కైయో వంటి చిన్న పట్టణాలకు ఇలాంటి వాహనాలు ఉపకరిస్తాయని అన్నారు. అంతేకాదు ఈ డీఎంవీ వాహనం మినీ బస్సులా కనిపిస్తుందని, సుమారు 21 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చని తెలిపారు. రైల్వే పట్టాలపై గంటకు 60 కి.మీ వేగంతోనూ, రోడ్డపై 100 కి.మీ వేగంతో వెళ్లగలదని పేర్కొన్నారు. ఇది పూర్తిగా డీజిల్ ఆధారిత వాహనమని కంపెనీ పేర్కొంది. జపాన్‌ వాసులను ఈ ప్రాజెక్టును తప్పక ప్రోత్సహిస్తారని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read:  వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్

 కళ్లల్లో కారం కొట్టి చోరీ చేసేందుకు యత్నించాడు.. కానీ ప్లాన్ ఉల్టా అయ్యింది..