Strain Virus: స్ట్రైయిన్ వైరస్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న జపాన్ ప్రభుత్వం.. ఇకపై వారెవరికీ దేశంలోకి అనుమతి లేదు..

కరోనా రూపాంతరం అయిన స్ట్రెయిన్ వైరస్‌తో ప్రపంచం మరోమారు అల్లాడిపోతోంది. ఆ పేరు వింటేనే హడిలిపోతోంది. ఈ వైరస్‌ను తమ...

Strain Virus: స్ట్రైయిన్ వైరస్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న జపాన్ ప్రభుత్వం.. ఇకపై వారెవరికీ దేశంలోకి అనుమతి లేదు..
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Dec 27, 2020 | 7:21 AM

Strain Virus: కరోనా రూపాంతరం అయిన స్ట్రెయిన్ వైరస్‌తో ప్రపంచం మరోమారు అల్లాడిపోతోంది. ఆ పేరు వింటేనే హడిలిపోతోంది. ఈ వైరస్‌ను తమ దేశంలోకి రానివ్వకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే జపాన్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి విదేశీయుల రాకపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది. అంతేకాదు.. సోమవారం నుండి కొత్త వీసాలను జారీ చేయడం కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. జపాన్ దేశస్థులెవరైనా స్వదేశానికి తిరిగి వస్తున్నట్లయితే వారు 72 గంటల ముందుగానే కోవిడ్ 19 నెగిటివ్‌కు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే వారు జపాన్‌కు వచ్చాక కూడా కోవిడ్ 19 టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుందని ఆ దేశ ప్రభుత్వం కండీషన్ పెట్టింది. ఇదిలాఉండగా, జపాన్ విధించిన ఈ నిషేధాజ్ఞలు థాయ్‌లాండ్, వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్‌ సహా పది దేశాలకు చెందిన విద్యార్థులు, బిజినెస్‌ మెన్‌లకు వర్తించదని జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also read:

Farmers Protest: కాంగ్రెస్ నేతల ధర్నాకు కారణం అదే.. రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్..

New Strain : యూకే నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్..రంగంలోకి దిగిన వైద్య అధికారులు