AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jakarta Is Sinking: నీట మునిగిపోతున్న జకార్తా.. కోటి మంది ప్రజల భవిష్యత్ ప్రశ్నార్ధకం .. కొత్త రాజధాని నిర్మాణం

ఇండోనేషియా రాజధాని జకార్తాలో నివసించే ప్రజల సమస్య మాత్రం భిన్నం. ఈ నగరంలో నివసించే ప్రజల కాళ్ల కింద భూమి ఏటా 25 సెంటీమీటర్ల చొప్పున నెమ్మదిగా కుంగిపోతుంది. నగరంలోని కొన్ని ప్రాంతాలు చాలా వేగంగా మునిగిపోతున్నాయి. వీటిని రక్షించడం అసాధ్యం. జకార్తాలో దాదాపు 10.6 మిలియన్ల ఇళ్లు సముద్రం లోపల కలిసిపోయే దశలో ఉన్నాయి. సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో నగరంలో నివాసితుల ఇళ్లను.. తమ దేశ రాజధానిని ప్రభుత్వం రక్షించగలదా అనే ప్రశ్న తలెత్తుతుంది?

Jakarta Is Sinking: నీట మునిగిపోతున్న జకార్తా.. కోటి మంది ప్రజల భవిష్యత్ ప్రశ్నార్ధకం .. కొత్త రాజధాని నిర్మాణం
Jakarta Is Sinking
Surya Kala
|

Updated on: Jun 07, 2024 | 8:15 AM

Share

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.. మరికొన్ని దేశాల్లో అంతర్గత భద్రత ప్రమాదంలో పడింది..కొన్ని దేశాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి, ఉద్యోగవకాశాలు కల్పించలేక కొన్ని దేశాలు సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే ఇండోనేషియా రాజధాని జకార్తాలో నివసించే ప్రజల సమస్య మాత్రం భిన్నం. ఈ నగరంలో నివసించే ప్రజల కాళ్ల కింద భూమి ఏటా 25 సెంటీమీటర్ల చొప్పున నెమ్మదిగా కుంగిపోతుంది. నగరంలోని కొన్ని ప్రాంతాలు చాలా వేగంగా మునిగిపోతున్నాయి. వీటిని రక్షించడం అసాధ్యం. జకార్తాలో దాదాపు 10.6 మిలియన్ల ఇళ్లు సముద్రం లోపల కలిసిపోయే దశలో ఉన్నాయి. సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో నగరంలో నివాసితుల ఇళ్లను.. తమ దేశ రాజధానిని ప్రభుత్వం రక్షించగలదా అనే ప్రశ్న తలెత్తుతుంది?

ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండోనేషియా ప్రభుత్వం తన రాజధానిని నుసంతారాకు మార్చాలని యోచిస్తోంది. నుసంతారా నగరం జకార్తాకు ఉత్తరాన 1,400 కిమీ దూరంలో ఉంది. కొత్త రాజధాని నగరాన్ని నిర్మించే ప్రాజెక్టుకు దాదాపు 35 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని.. 2035 నాటికి ఇది పూర్తవుతుందని నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో కూడా ఆగస్టు 2019లో పునరావాస ప్రణాళికను ఆమోదించారు.

నగరం ఎందుకు మునిగిపోతోందంటే?

ఇవి కూడా చదవండి

జకార్తా గత పదేళ్లలో రెండున్నర మీటర్ల మేర భూమి సముద్రంలోకి పోయింది. అయితే నీటిపై ఉన్న ఈ నగరం నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. నగరం దిగువ నుండి 13 నదులు ఉద్భవించాయి. మరోవైపు ఈ నగరం సముద్రం చుట్టూ ఉంది. దీని కారణంగా నగర భూమి చిత్తడి నేలగా ఉంది. అంతేకాదు వరదల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు తరచుగా నీటిలో మునిగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా భూగర్భ జలాలు క్షీణించడంతో ఇక్కడ తీవ్రమైన సమస్య నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

ఇండోనేషియాలోని ప్రతిష్టాత్మక టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ అయిన ‘బాండూంగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో 20 ఏళ్లుగా జకార్తా భూమిలో మార్పుపై అధ్యయనం చేస్తున్న హ్యారీ ఆండ్రెస్.. మాట్లాడుతూ 2050 నాటికి ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతుందని అని చెప్పారు. ఉత్తర జకార్తాలో 95% శాతం వాటా భూమి నీట మునిగిపోతుంది. అలాగే ప్రపంచంలోని అన్ని తీరప్రాంత నగరాల మునిగిపోయే రేటు కంటే జకార్తా మునిగిపోయే రేటు రెండింతలు ఎక్కువ అని చెప్పారు. అయితే ఈ సమస్య జకార్తాకు మాత్రమే పరిమితం కాదని.. సెమరాంగ్ (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), యోకోహామా (జపాన్) మెక్సికో సిటీలు కూడా ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

భూమి నుండి నీరు ఎలా పోతుంది?

జకార్తాలో నివసించే ప్రజలకు నీటి లభ్యత పెద్ద సమస్యగా మారింది. నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు భూగర్భజలాలపై ఆధారపడవలసి ఉంటుంది. అయితే ఇక్కడ భూగర్భ జలాలను వెలికితీస్తే భూమి మునిగిపోతుంది. అయితే జకార్తాలో స్థానిక ప్రజలకు అలాగే పరిశ్రమలు భూ గర్భజలాలను నియమాలను అతిక్రమించి ఉపయోగిస్తున్నారు. అవును ఈ నగర ప్రజలు సాధారణం కంటే ఎక్కువ నీటిని తీసుకుని వినియోగిస్తున్నారు.

ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాలలో ఒకటి

నుసంతారా బోర్నియోలో ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాలలో ఒకటి. ద్వీపంలో దాదాపు మూడు వంతులు ఇండోనేషియా భూభాగం కాగా.. మిగిలిన భాగం మలేషియా, బ్రూనైకి చెందినది. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం ప్రెసిడెంట్ విడోడో నుసాంటారా నిర్మాణాన్ని ప్రారంభించడానికి సుమారు 100,000 మంది కార్మికులను పంపారు. నిర్మాణ పురోగతిలో భాగంగా ఈ కార్మికుల సంఖ్య తర్వాత 150,000.. 200,000 మధ్య పెరిగింది. 2022 నుండి ప్రభుత్వ సౌకర్యాలు, ఇతర కార్యాలయాల నిర్మాణం ప్రారంభించేందుకు వీలుగా అడవిలో రోడ్ల నెట్‌వర్క్‌ను నిర్మించినట్లు ప్రాజెక్ట్ వెబ్‌సైట్ చూపిస్తుంది.

ఈ దేశాలు ఇంతకు ముందు కూడా రాజధానిని మార్చుకున్నాయి

ఇండోనేషియా కంటే ముందే బ్రెజిల్, నైజీరియా వంటి దేశాలు తమ రాజధానిని మార్చుకున్నాయి. అయితే, జకార్తా విషయంలో వాతావరణ సంక్షోభం దీనికి ప్రధాన కారణం. నీటిమట్టం పెరగడం వెనుక భూగర్భ జలాలు విపరీతంగా దోచుకోవడమే కారణమని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..