Israeli Airstrikes: యెమెన్‌లో వైమానిక బాంబు దాడి.. తృటిలో తప్పించుకున్న WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌

|

Dec 28, 2024 | 9:24 AM

ఇరాన్, అలీన హౌతీ ఉద్యమ దారులపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తూనే ఉంది. తాజాగా యెమెన్‌లోని ప్రధాన విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడుల్లో WHO డైరెక్టర్‌ జనరల్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. యెమెన్‌లో జరిగిన బాంబు దాడిలో సెకన్‌ పాటులో ప్రాణాలతో బయటపడ్డారు. దాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండిస్తోంది.

Israeli Airstrikes: యెమెన్‌లో వైమానిక బాంబు దాడి.. తృటిలో తప్పించుకున్న WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌
Israeli Airstrikes On Yemen
Follow us on

యెమెన్‌, ఇజ్రాయెల్‌ల మధ్య భీకర దాడులు కంటిన్యూ అవుతున్నాయి. యెమెన్‌లోని సనా విమానాశ్రయంతో పాటు పలు ఎయిర్ పోర్టులు, పలు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అయితే యెమెన్‌లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అధానోమ్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. టెడ్రోస్ ఇంటర్‌ నేషనల్ ఎయిర్‌ పోర్టులో విమానం ఎక్కేందుకు వెయిట్ చేస్తున్న క్రమంలో ఈ వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ఎయిర్ పోర్టు సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.

ఈఘటనలో టెడ్రోస్ మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది.  ఐక్యరాజ్యసమితికి చెందిన పలువురు తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు. పౌరులు, మానవతా కార్మికులే లక్ష్యంగా దాడులు చేయకూడదని సూచిస్తున్నారు. ఖైదీల విడుదల, యెమెన్‌లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులపై చర్చలు జరిపేందుకు ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో ట్రెడోస్ అధానోమ్ అక్కడికి వెళ్లారు.

చర్చల అనంతరం తిరిగి సనా ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. ప్లైట్ కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారి బాంబు దాడి జరిగింది. దీంతో ఒక్కసారి ఆందోళనకు గురైనట్లు చెప్పారు ట్రెడోస్. దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..