Israel vs Palastina: గాజా మీద భీకరంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్.. వారే లక్ష్యంగా చేసుకొని..

Israel vs Palastina: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. వరుసగా రెండో రోజున కూడా ఇజ్రాయెల్‌

Israel vs Palastina: గాజా మీద భీకరంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్.. వారే లక్ష్యంగా చేసుకొని..
Israel Attacks

Updated on: Aug 08, 2022 | 9:59 AM

Israel vs Palastina: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. వరుసగా రెండో రోజున కూడా ఇజ్రాయెల్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌ కొనసాగాయి. గాజాతో పాటు పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌-PIJ ఉగ్రవాదులు లక్ష్యంగా యుద్ధవిమానాలు విరుచుకుపడ్డాయి. 400లకు పైగా రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ ప్రయోగించింది ఇజ్రాయెల్‌.. ఈ దాడుల్లో PIJ మిలిటెంట్లకు చెందిన భవనాలు ఈ దాడుల్లో నేలమట్టమయ్యాయి.

రెండు రోజులుగా జరిగిన ఈ దాడుల్లో 31 మందికి దరకూ మరణించారు. పెద్ద సంఖ్యలో మిలిటెంట్లతో పాటు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. మరణించిన వారిలో PIJకి చెందిన ఇద్దరు కీలక నాయకులు ఖలీద్‌ మన్సూర్‌, తైసీర్‌ జబారీ కూడా ఉన్నారని చెబుతోంది ఇజ్రాయెల్‌. రఫాలోని PIJ కీలక నాయకుడు ఖలీద్‌ మన్సూర్‌ ఇంటిని ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసింది. గాజాలో మిలిటెంట్ ఆపరేషన్లకు ఇతడే కీలక సూత్రధారి అని భావిస్తున్నారు. గతంలో ఖలీద్‌కు హతమార్చేందుకు ఇజ్రాయిల్‌ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఓ క్షిపణి కారును ఢీకొట్టడంతో ఓ వృద్ద మహిళ మరణించడంతో పాటు ఆరుగురు గాయపడ్డారు. PIJ నుంచి తీవ్ర ముప్పు ఉన్నందునునే ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తాజా దాడులపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రతీకరా దాడులకు పాల్పడలేదు. 2021 మే నెల తర్వాత ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య చోటు మరోసారి కీలక ఘర్షణ జరుగుతోంది.

గాజాలో ఇజ్రాయెల్‌ వైమానికదాడులకు వ్యతిరేకంగా జోర్డాన్‌ ప్రజలు ఆందోళనకు దిగారు. గాజాపై దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. జోర్డాన్‌ ప్రధాని కార్యాలయం ఎదుట జాతీయజెండాలతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో వేలమంది పాల్గొన్నారు. గాజా మృతులకు నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..