Covid-19 variant: ఇజ్రాయిల్‌లో మరో రెండు డెంజర్ వేరియంట్స్.. భయం గుప్పిట్లో ప్రపంచం..

|

Mar 17, 2022 | 10:10 AM

Israel reports new variant of Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచిఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది.

Covid-19 variant: ఇజ్రాయిల్‌లో మరో రెండు డెంజర్ వేరియంట్స్.. భయం గుప్పిట్లో ప్రపంచం..
Coronavirus
Follow us on

Israel reports new variant of Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచిఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. గత రెండేళ్లుగా కుదిపేసిన కరోనా మహమ్మారి ముప్పు ఇక తప్పినట్లేనని అనుకుంటున్న క్రమంలో కొత్త వేరియంట్స్‌ అలజడి సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌లో కోవిడ్ వేరియంట్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్-19 వైరస్‌.. ఒమిక్రాన్ తోపాటు దాని ఉప వేరియంట్లు BA.1, BA.2గా రూపాంతరం చెందుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇజ్రాయిల్ బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్షల చేయగా.. BA.1, BA.2 వేరియంట్లు వెలుగులోకి వచ్చినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌లు బీఏ.1, బీఏ.2 ను వేరియంట్లు ఉన్నట్లు పేర్కొంది.

రెండు వేరియంట్లు కలిగిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలన్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్ కేసుల గురించి ఇప్పటివరకు తేలిదని పేర్కొంది. దీనిగురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ పాండమిక్ రెస్పాన్స్ చీఫ్, సల్మాన్ జర్కా పేర్కొన్నారు. కాగా.. ఇజ్రాయెల్ లోని 9.2 మిలియన్ల జనాభాలో నాలుగు మిలియన్లకు పైగా ప్రజలు మూడు కరోనావైరస్ వ్యాక్సిన్ డోసులను పొందినట్లు పేర్కొన్నారు.

Also Read:

Viral Video: ఏనుగులకు కోపం వస్తే ఎట్టుంటుందో తెలుసా.? వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!

AgustaWestland case: అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో మరో మలుపు.. ఛార్జ్‌షీట్‌లో మాజీ అధికారుల పేర్లు..