ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణలో వందలు, వేల సంఖ్యలో పౌరులు బలి అవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గాజాలో తల్లిదండ్రులు తమ పిల్లలకు టాటూలు వేయించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తద్వారా వారు దాడిలో చనిపోతే గుర్తించటానికి వీలుగా ఉంటుందని భావిస్తున్నారట. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరి హృదయాలు చలించిపోతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే 4 వేల మందికి పైగా మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మీడియా కథనాల ప్రకారం, పిల్లల చేతులు, కాళ్ళపై వారి పేర్లను అరబిక్‌లో పెయింట్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఘర్షణలో నలుగురు చిన్నారులు మృతి చెందినట్లు కొన్ని వీడియోల్లో కనిపిస్తోంది. అందులో నలుగురు పిల్లలూ తమ కాళ్లపై పేర్లు రాసి ఉంచిన మార్చురీలో కనిపించారు.. ప్రస్తుతం ఈ చిన్నారుల తల్లిదండ్రులు బతికే ఉన్నారా..?అనే విషయంపై స్పష్టత లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రక్రియ సర్వసాధారణమైపోయిందని అంటున్నారు అక్కడి ప్రజలు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రులకు చేరుకోవడం వీడియోలో కనిపిస్తోంది. చిన్నారులతో సహా పలువురు గాయపడిన వారు కారిడార్‌లో పడి ఉన్నారు.
మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలోని ఓ జర్నలిస్టు ఫ్యామిలీ బలైపోయింది. బుధవారం రాత్రి అల్ జజీరా జర్నలిస్ట్,అరబిక్ బ్యూరో చీఫ్ వేల్ అల్ దహదౌహ్ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ గాజాలోని ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న నుసెరాత్ క్యాంప్ అతని ఇంటిని లక్ష్యంగా జరిగిన దాడిలో జర్నలిస్ట్ భార్య, కుమార్తె , కొడుకు మరణించారు. ఒకేసారి కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన అతడు బోరున విలపించాడు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆ హృదయ విదారక దృశ్యం అందరినీ కలచివేసింది.
My colleague at @AJArabic Wael Al Dahdouh just lost his wife, daughter, and son in an Israeli strike “ that targeted his home “ in #Gaza.
He reported on that strike earlier, without knowing that some family members were among the dead in that Israeli bombing.#Gazabombing pic.twitter.com/SObiuP5zer
— Wajd Waqfi وجد وقفي (@WajdWaqfi) October 25, 2023
ఇదిలా ఉంటే, హమాస్ సాయుధ బలగాలు.. బంధీలుగా మార్చుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఒక్కొక్కరిగా విడిచిపెడుతుంది. బంధీలు కూడా తమను హమాస్ సాయుధులు బాగానే చూసుకున్నారని చెబుతుండగా, ఇజ్రాయెల్ విమానాలు పాలస్తీనాలో కరపత్రాలు వెదజల్లుతోంది. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ సాయుధ బలగాలు బంధించిన వివరాలను తమకు అందించాలని కోరుతుంది. ఆ సమాచారం అందించిన వారికి తగిన రివార్డు కూడా అందిస్తామని ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..