Israel Hamas War: హమాస్‌తో పోరాడుతూ భారత సంతతికి చెందిన ఇజ్రాయెల్ సైనికుడు మృతి..

|

Dec 08, 2023 | 7:17 AM

గాజా స్ట్రిప్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన రఫా మధ్యలో హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు బుధవారం దాడులు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ ఆర్మీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఇజ్రాయెలీ భూదాడుల కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు భూభాగం దక్షిణ కొనకు పారిపోవాల్సి వచ్చింది. సహాయక బృందాలు ఆహారం, నీరు, ఇతర సామాగ్రిని పంపిణీ చేయకుండా  నిరోధించాయి.

Israel Hamas War: హమాస్‌తో పోరాడుతూ భారత సంతతికి చెందిన ఇజ్రాయెల్ సైనికుడు మృతి..
Israel Hamas War
Follow us on

హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ అనంతరం మళ్ళీ యుద్ధం జరుగుతోంది. ఈ వారం జరిగిన పోరాటంలో భారత సంతతికి చెందిన ఇజ్రాయెల్ సైనికుడు మరణించాడు. భారతీయ యూదు సంఘం సభ్యులు ఈ సమాచారం ఇచ్చారు. భారతీయ యూదు సమాజానికి చెందిన వారు మృతుడు అష్డోడ్ నివాసి అయిన మాస్టర్ సార్జెంట్ (రెజి.) గిల్ డేనియల్ మంగళవారం గాజాలో హత్య చేయబడ్డాడు. గిల్  అంత్యక్రియలు బుధవారం అతని స్వగ్రామంలోని సైనిక శ్మశానవాటికలో జరిగాయి. గాజా స్ట్రిప్‌లో జరిగిన పోరులో మరణించిన ఇద్దరు సైనికుల్లో గిల్ డేనియల్ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలు ధృవీకరించాయి.

యుద్ధంలో అనేక మంది సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్

ఈ భయంకరమైన యుద్ధంలో ఇజ్రాయెల్ చాలా మంది సైనికులను కోల్పోయిందని ఇండియన్ జ్యూయిష్ హెరిటేజ్ సెంటర్ తెలిపింది. ఈ యుద్ధంలో దేశ గౌరవం కోసం పోరాడుతూ చాలా మంది ఉత్తమ కుమారులను, కుమార్తెలను ఇజ్రాయెల్ కోల్పోయింది. ఈరోజు మరో IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) సైనికుడు మాస్టర్ సార్జెంట్ (రెజి.) గిల్ డేనియల్స్ (34) మృతికి సంతాపం తెలియజేస్తున్నామని చెప్పారు.  గిల్ తల్లిదండ్రులు జోయెల్, మజల్లలు.

భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన డేనియల్

గిల్ డేనియల్ బెనే ఇజ్రాయెల్ సంఘం సభ్యుడు. భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన యువకుడు. గాజాలో IDF తన గ్రౌండ్ క్యాంపెయిన్ ప్రారంభించినప్పటి నుండి దాదాపు 86 మంది ఇజ్రాయెల్ సైనికులు పోరాటంలో మరణించారు. అక్టోబరు 7 నుంచి ఇప్పటి వరకు నలుగురు భారత సంతతికి చెందిన  ఇజ్రాయెల్ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

హమాస్ ఉగ్రవాదులు లక్ష్యంగా

ఇదిలావుండగా గాజా స్ట్రిప్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన రఫా మధ్యలో హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు బుధవారం దాడులు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ ఆర్మీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఇజ్రాయెలీ భూదాడుల కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు భూభాగం దక్షిణ కొనకు పారిపోవాల్సి వచ్చింది. సహాయక బృందాలు ఆహారం, నీరు, ఇతర సామాగ్రిని పంపిణీ చేయకుండా  నిరోధించాయి.

పౌరులపై ప్రత్యక్ష దాడి

అదే సమయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు సుమారు రెండు నెలల క్రితం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన రెండు దాడులు స్పష్టంగా ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని.. పౌరులపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. ఈ దాడుల్లో బ్రిటీష్ వార్తా సంస్థ రాయిటర్స్‌కు చెందిన వీడియోగ్రాఫర్ మరణించగా, మరో ఆరుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవ హక్కుల పర్యవేక్షణ బృందం ఇజ్రాయెల్ దాడులను యుద్ధ నేరాలుగా పరిశోధించాలని పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..