శ్రీలంక నరమేధం వెనుక ఐసిస్ ప్లాన్..?
శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి. ఆత్మాహుతికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలను ఐసిస్ తాజాగా విడుదల చేసింది. అబూ ఉబైద్, అబుల్ ముక్తార్, అబ్దుల్ బర్రాల ఫొటోలను ఉగ్రవాద సంస్థ రిలీజ్ చేసింది. ఈ ముగ్గురు నేషనల్ తాహిత్ జమాత్ సంస్థలో కీలక పాత్ర పోషించినట్లు లంక ప్రభుత్వం కూడా వెల్లడించింది. ఆత్మాహుతి దాడి చేసిన 8మంది శ్రీలంకకు చెందిన వారేనని ప్రభుత్వవర్గాలు ధ్రువీకరించాయి. సూసైడ్ బాంబర్లకు […]
శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి. ఆత్మాహుతికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలను ఐసిస్ తాజాగా విడుదల చేసింది. అబూ ఉబైద్, అబుల్ ముక్తార్, అబ్దుల్ బర్రాల ఫొటోలను ఉగ్రవాద సంస్థ రిలీజ్ చేసింది. ఈ ముగ్గురు నేషనల్ తాహిత్ జమాత్ సంస్థలో కీలక పాత్ర పోషించినట్లు లంక ప్రభుత్వం కూడా వెల్లడించింది.
ఆత్మాహుతి దాడి చేసిన 8మంది శ్రీలంకకు చెందిన వారేనని ప్రభుత్వవర్గాలు ధ్రువీకరించాయి. సూసైడ్ బాంబర్లకు జహరీన్ హషీం అలియాస్ అబూ ఉబైద్ నేతృత్వం వహించాడు. ఎన్‌టీజే ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో వీరు నిరంతం టచ్‌లో ఉన్నట్లు శ్రీలంక నిఘా వర్గాలు ధృవీకరించాయి. ముస్లింలపై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని నెలరోజుల క్రితమే ఎన్‌టీజే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్‌టీజేతో కలిసి ఐసిస్ ఈ దాడులు చేసినట్లు నిఘా వర్గాలు తెలుపుతున్నాయి.