ఎక్కువ సంతోషించకండి.. కొత్త నాయకుడొచ్చాడు.. ఐసిస్ వార్నింగ్

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఫౌండర్, అగ్రనేత అబూ బకర్ అల్ బగ్దాదీని అమెరికా దళాలు తుదముట్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐసిస్ సంస్థ తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది. ఐసిస్ కొత్త చీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్‌ హష్మీ ఎంపిక చేసినట్లు ఆ సంస్థ సెంట్రల్ మీడియా, అల్ ఫుర్కాన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి గురువారం ఒక ఆడియో ప్రకటనను విడుదల చేశారు. ఇక ఆ ఆడియో సందేశంలో.. అబూ బకర్ అల్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:21 am, Fri, 1 November 19
ఎక్కువ సంతోషించకండి.. కొత్త నాయకుడొచ్చాడు.. ఐసిస్ వార్నింగ్

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఫౌండర్, అగ్రనేత అబూ బకర్ అల్ బగ్దాదీని అమెరికా దళాలు తుదముట్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐసిస్ సంస్థ తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది. ఐసిస్ కొత్త చీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్‌ హష్మీ ఎంపిక చేసినట్లు ఆ సంస్థ సెంట్రల్ మీడియా, అల్ ఫుర్కాన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి గురువారం ఒక ఆడియో ప్రకటనను విడుదల చేశారు.

ఇక ఆ ఆడియో సందేశంలో.. అబూ బకర్ అల్ బాగ్దాదీతోపాటు అతని సన్నిహిత అనుచరుడు అబు హసన్ అల్ ముహాజిర్ మరణించాడని ధ్రువీకరించాడు. ఆ తరువాత అమెరికాను ఉద్దేశించి మాట్లాడిన అధికారి ప్రతినిధి.. ‘‘బాగ్దాదీ మృతిపై ఎక్కువ సంతోషించొద్దు. ఐసిస్ కొత్త నాయకుడు పండితుడు, ప్రసిద్ధ యోధుడు, యుద్ధ వీరుడు. అతడు అమెరికన్ దళాలతో పోరాడుతాడు’’ అని పేర్కొన్నాడు.

కాగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన అబూ బకర్ నివసిస్తున్న స్థావరంపై పక్కా సమాచారాన్ని సేకరించిన అమెరికా దళాలు.. ఉత్తర సిరియా ప్రాంతంలో కుర్దు సేనలతో కలిసి దాడులు చేశాయి. ఈ క్రమంలో దళాల నుంచి తప్పించుకోలేకపోయిన బాగ్దాదీ తనకు తానే ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఈ ఘటనలో అతడి ఇద్దరు కుమారులు కూడా ముక్కలు ముక్కలు అయిపోయారు. ఆ తరువాత బాగ్దాదీ అనుచరుడిని కూడా మట్టుబెట్టారు.