China President: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అరెస్ట్‌ చేశారా.? కారణం అదేనా.? ఇందులో నిజం ఎంత..

China President: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సంబంధించిన  కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తకు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా...

China President: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అరెస్ట్‌ చేశారా.? కారణం అదేనా.? ఇందులో నిజం ఎంత..
China President
Follow us

|

Updated on: Sep 25, 2022 | 7:50 AM

China President: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సంబంధించిన  కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తకు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. చైనాకు ఏకైక లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిర పరుచుకోవాలనే ప్రయత్నంలో ఉన్న జిన్‌పింగ్‌ను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారనేది సదరు వార్త సారంశం. చైనా సైన్యాధిపతి పదవి నుంచి తొలగించి జిన్‌పింగ్‌ను గృహ నిర్భంధంలో ఉంచారని వార్తలు పుకార్లు చేస్తున్నాయి. చైనా పాలన మొత్తం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది.

అంతేకాకుండా జిన్‌పింగ్‌ ప్రత్యర్థులు చైనాకు కొత్త అధ్యక్షున్ని కూడా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. చైనా ఆర్మీ వాహనాలు హువాన్‌లై కౌంటీ నుంచి హిబే ప్రావిన్సు ఝాంగ్‍జియాకో సిటీ వరకు 80 కీలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లాయని చైనాకు చెందిన మహిళా నాయకురాలు జెన్నిఫర్‌ జంగ్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. దీంతో జిన్‌పింగ్‌ అరెస్ట్‌పై వస్తోన్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది. మరోవైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు.. జిన్‌పింగ్‌ హౌస్ అరెస్టు రూమర్‌ను ఓ సారి చెక్‌ చేయండని కామెంట్‌ చేయడంతో భారత్‌లోనూ ఈ వార్త వైరల్‌ అవుతోంది.

కారణం అదేనా.?

ఇదిలా ఉంటే చైనాలో అవినీతి వ్యవస్థను ప్రక్షాళనలో భాగంగా.. జిన్‌పింగ్‌ ఇటీవల మాజీ మంత్రులు సన్‌ లిజున్‌, వాంగ్ లైక్‌లకు మరణ శిక్ష విధించారు. మరో ఐదుగురు ఉన్నతాధికారులకు జైలుశిక్ష పడింది. ఈ చర్యలతో ఆగ్రహించిన ప్రత్యర్థి వర్గం జిన్‌పింగ్‌ను గృహ నిర్భందంలో పెట్టి, పాలనా పగ్గాలను స్వాధీనం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో