Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 హెలికాఫ్టర్.. ఏ దేశం తయారు చేసిందంటే?

|

May 20, 2024 | 12:49 PM

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆదివారం దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. కుప్పకూలిన శిధిలాలను గుర్తించినట్లు ఇరాన్ అధికారులు సోమవారం అధికారికంగా ధృవీకరించారు. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను Bell 212 అమెరికాకు చెందిన బెల్‌ టెక్స్‌ట్రాన్‌ కంపెనీ తయారు చేసింది. బెల్‌-212లో గరిష్ఠంగా 15 మంది వరకు ప్రయాణించవచ్చు. రెండు బ్లేడ్లతో ఉండే ఈ మధ్యశ్రేణి హెలికాప్టర్‌ను..

Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 హెలికాఫ్టర్.. ఏ దేశం తయారు చేసిందంటే?
Bell 212 Helicopter
Follow us on

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆదివారం దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. కుప్పకూలిన శిధిలాలను గుర్తించినట్లు ఇరాన్ అధికారులు సోమవారం అధికారికంగా ధృవీకరించారు. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను Bell 212 అమెరికాకు చెందిన బెల్‌ టెక్స్‌ట్రాన్‌ కంపెనీ తయారు చేసింది. బెల్‌-212లో గరిష్ఠంగా 15 మంది వరకు ప్రయాణించవచ్చు. రెండు బ్లేడ్లతో ఉండే ఈ మధ్యశ్రేణి హెలికాప్టర్‌ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాలకు వినియోగించుకునేలా రూపొందించారు.

బెల్ హెలికాప్టర్లను 1960 దశకం చివర్లో కెనడియన్‌ మిలిటరీ కోసం UH-1 (యుటిలిటీ హెలికాఫ్టర్‌) ఇరోక్వోయిస్‌కి అప్‌గ్రేడ్‌గా అభివృద్ధి చేసింది. ఇలా అప్‌గ్రేడ్‌ చేసిన కొత్త డిజైన్‌లో ఒకటికి బదులుగా రెండు టర్బోషాఫ్ట్ ఇంజన్‌లను ఉపయోగించారు. ఫలితంగా ఎక్కువ బరువును మోసుకెళ్లే సామర్ధ్యం పెరిగింది. దీనిని 1971లో యునైటెడ్ స్టేట్స్, కెనడా.. ఈ రెండూ దేశాలు సైనిక అవసరాల కోసం వినియోగించడం మొదలుపెట్టాయి. ఇక బెల్‌ 412ను ప్రజలను రవాణా చేసేందుకు, అగ్నిమాపక సామగ్రి, సరుకు రవాణా, ఆయుధాల రవాణా వంటి పలుఅవసరాలకు అనుగుణంగా కంపెనీ తయారు చేసింది.

ఏయే దేశాలు బెల్‌ 212 వినియోగిస్తున్నాయంటే..

బెల్ 212ను జపాన్ కోస్ట్ గార్డ్, థాయిలాండ్ నేషనల్‌ పోలీసు విభాగం వంటి పలు దేశాలు వినియోగిస్తున్నాయి. ఫ్లైట్‌గ్లోబల్ 2024 ప్రపంచ వైమానిక దళ డైరెక్టరీ ప్రకారం.. ఇరాన్ ప్రభుత్వం బెల్‌ 212ను ఎన్ని కార్యకలాపాలు వినియోగిస్తుందో స్పష్టంగా తెలియదు. అయితే దాని వైమానిక దళం, నౌకాదళంలో ఈ కంపెనీ హెలికాఫ్టర్లను మొత్తం 10 వినియోగిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

బెల్‌-212 గతంలో ఏవైనా ప్రమాదాలు జరిగాయా?

1997లో పెట్రోలియం హెలికాప్టర్స్‌కు చెందిన బెల్‌-212 లూసియానా తీరంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 2009లో కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 2023 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలో మరో హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఇక తాజాగా ఆదివారం మరో హెలికాఫ్టర్ కుప్పకూలింది. నేటికాలంలో తయారు చేస్తున్న హెలికాప్టర్లలో అనేక భద్రతా పీచర్లు వస్తున్నప్పటికీ.. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రయాణికుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మెకానికల్‌ లోపాలు, వాతావరణం, శత్రువుల దాడి వల్ల కూడా ఇవి కుప్పకూలుతుంటాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.