AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌..! తమ దేశంలోని అణు కేంద్రాలపై దాడులను ఖండిస్తూ..

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఇరు దేశాల మధ్య పరస్పర క్షిపణి దాడులు జరుగుతున్నాయి. అమెరికా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడి చేసింది. ఇజ్రాయెల్‌ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని కోరింది. ఇరాన్‌ అమెరికా దాడిని ఖండించింది. అమెరికాపై ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌..! తమ దేశంలోని అణు కేంద్రాలపై దాడులను ఖండిస్తూ..
Iran Vs Usa
SN Pasha
|

Updated on: Jun 22, 2025 | 12:51 PM

Share

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం భీకరమైన పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా శనివారం రాత్రి ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడులు నిర్వహించింది. అమెరికా దాడి తర్వాత కూడా ఇరాన్‌ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతోంద. ఇరాన్‌ నుంచి భీకరమైన దాడి జరుగుతుండటంతో తమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం సూచించింది. దేశ వ్యాప్తంగా హై అలెర్ట్‌ ప్రకటించింది. రాజధాని టెల్‌ అవీవ్‌తో సహా పలు ప్రాంతాల్లో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ కిపణుల వర్షం కురిపిస్తోంది. టెల్ అవీవ్‌, జెరూసలెం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు శబ్ధాలు మారుమోగిపోతున్నాయి.

ఇరాన్‌ ప్రయోగిస్తున్న మిస్సైల్స్‌ను ఇజ్రాయెల్‌ కొన్నింటిని అడ్డుకోగా.. చాలా వరకు అడ్డుకోలేకపోతోంది. అలాగే ఇజ్రాయెల్‌ కూడా ఇరాన్‌పై దాడి చేసి.. వారి మిస్సైల్‌ లాంఛర్లను ధ్వంసం చేసింది. ఒకవైపు ఇజ్రాయెల్‌తో భీకర యుద్ధం చేస్తూనే.. మరోవైపు తమ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్‌ ఖండించింది. అమెరికాకు ఇరాన్ మంత్రి సయ్యద్ అబ్బాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అణుస్థావరాలపై అమెరికా దాడులను ఖండించిన సయ్యద్.. అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో ఐరాస సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, ప్రపంచదేశాలు స్పందించాలని కూడా ఇరాన్ మంత్రి అబ్బాస్ కోరారు.

కాగా.. అమెరికా తమపై జరిపిన దాడికి ప్రతీకారంగా తమ దేశానికి సమీపంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని.. ఇరాన్‌ దాడులకు దిగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకైతే అలాంటి చర్యలేవి ఇరాన్‌ తీసుకోలేదు. కేవలం ఇజ్రాయెల్‌పై మాత్రమే మిస్సైల్స్‌ వర్షం కురిపిస్తోంది. అమెరికాపై అప్పుడే ప్రతి దాడి సరికాదని ఇరాన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అమెరికా చేసిన దాడిపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఖండించిన తర్వాత, తమకు రష్యా, చైనా వంటి దేశాల నుంచి మద్దతు లభించిన తర్వాత అమెరికాపై కూడా ఇరాన్‌ ప్రతి దాడి చేసే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి