AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi on Yoga Day 2023 Highlights: అంతర్జాతీయ యోగా డే.. యోగా కేవలం వ్యాయామం కాదు.. ఒక జీవన విధానం: మోడీ

PM Modi International Day of Yoga Speech in US Highlights Highlights: భారతదేశ యోగా విశిష్తను ప్రపంచానికి చాటి చెప్పేందుకు.. ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2014లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం..

PM Modi on Yoga Day 2023 Highlights: అంతర్జాతీయ యోగా డే.. యోగా కేవలం వ్యాయామం కాదు.. ఒక జీవన విధానం: మోడీ
Yoga Day
Shaik Madar Saheb
| Edited By: Subhash Goud|

Updated on: Jun 21, 2023 | 8:18 PM

Share

International Day of Yoga Highlights: భారతదేశ యోగా విశిష్తను ప్రపంచానికి చాటి చెప్పేందుకు.. ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2014లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీన్ని 175 దేశాలు ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబర్ 11న ప్రధాని మోడీ తీసుకున్న చొరవతో ఐక్యరాజ్యసమితి (UNO) అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21 వ తేదీని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ తన 9 ఏళ్ల పదవీకాలంలో తొలిసారిగా అమెరికా పర్యటన నిమిత్తం మంగళవారం న్యూయార్క్ చేరుకున్నారు . జూన్ 21 నుంచి 24 వరకు ఆయన అమెరికా పర్యటనలో ఉంటారు. కాగా, ఈరోజు 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక యోగా సెషన్‌కు ప్రధాని మోదీ నాయకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానితో పాటు ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఉన్నతాధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబారులు, పలువురు ముఖ్యులు హాజరుకానున్నారు. ఈ యోగా దినోత్సవ వేడుకలు.. పలు దేశాలతో పాటు.. మన దేశంలో కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది వసుదైవ కుటుంబకం అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jun 2023 08:13 PM (IST)

    యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి: మోడీ

    యోగా అనేది అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని, యోగాతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.

  • 21 Jun 2023 06:31 PM (IST)

    యోగా కేవలం వ్యాయామం కాదు.. ఒక జీవన విధానం: మోడీ

    యోగా.. భారత్‌లో ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న ప్రక్రియ అని, యోగా చేసేందుకు ఎలాంటి పేటెంట్‌ హక్కులు అక్కర్లేదన్నారు. అన్ని దేశాల సంప్రదాయాలకు సరిపోయే విధానం యోగా. యోగా కేవలం వ్యాయామం కాదని, ఒక జీవన విధానం అని అన్నారు.

  • 21 Jun 2023 06:23 PM (IST)

    యోగా అంటేనే అందరినీ కలిపేది- ప్రధాని మోదీ

    యోగా అంటేనే అందరినీ కలిపేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగా డే జరపాలనే ప్రతిపాదకు అన్ని దేశాలు మద్దతునిచ్చాయన్నారు. 2023ని చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించడం సంతోషకరమన్నారు. 2023ని చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించాలని భారత్‌ ప్రతిపాదన, భారత ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించింది.

  • 21 Jun 2023 06:20 PM (IST)

    యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు: మోదీ

    యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ యోగా డేలో అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని మోడీ అన్నారు.

  • 21 Jun 2023 06:18 PM (IST)

    యోగా డే వేడుకల్లో పీఎం మోడీ

    న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యోగి దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

  • 21 Jun 2023 05:46 PM (IST)

    యోగా దినోత్సవం మనందరిని దగ్గర చేసింది- మోడీ

    యోగా దినోత్సవం మనందరినీ మరింత దగ్గర చేసి మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

  • 21 Jun 2023 05:14 PM (IST)

    యోగా దినోత్సవానికి ప్రధాని మోదీతో కలిసి రానున్న ప్రముఖులు

    న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. మోడీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

    యోగా దినోత్సవానికి ప్రధాని మోదీతో కలిసి రానున్న ప్రముఖులు:

    • సబా కొరోసి, యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ, హంగేరియన్‌ దౌత్యవేత్త, ప్రస్తుతం 77వ అధ్యక్షుడు
    • మిస్టర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్‌ నగర 110వ మేయర్‌
    • అమీనా జె.మహమ్మద్, ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్
    • మిస్టర్ రిచర్డ్ గేర్, ప్రముఖ హాలీవుడ్ నటుడు
    • మిస్టర్ వాలా అఫ్సర్, సేల్స్‌ఫోర్స్‌లో చీఫ్ డిజిటల్ ఎవాంజెలిస్ట్
    • జే శెట్టి, అవార్డు గ్రహిత
    • వికాస్ ఖన్నా, అవార్డు గెలుచుకున్న భారతీయ చెఫ్, రెస్టారెంట్‌, టీవీ షో మాస్టర్‌చెఫ్ ఇండియా హోస్ట్
    • మైక్ హేస్, సిలికాన్ వ్యాలీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్ మేజర్
    • బ్రిట్ కెల్లీ స్లాబిన్స్కి, యూఎస్‌ నేవీ సీల్ అధికారి
    • ఫ్రాన్సిస్కో డిసౌజా, ప్రైవేటు ఈక్విటీ సీఈవో
    • కొలీన్ సెడ్మాన్ యీ, యోగా గురువు
    • రోడ్నీ యీ, ప్రముఖ యోగా శిక్షకుడు
    • డీడ్రా డిమెన్స్, ఆమె న్యూయార్క్ నగరంలో ప్రముఖ యోగా స్టూడియో వ్యవస్థాపకులు
    • క్రిస్టోఫర్ టాంప్కిన్స్, కాలిఫోర్నియాలోని బర్కిలీ విశ్వవిద్యాలయంలో పండితుడు
    • విక్టోరియా గిబ్స్, న్యూయార్క్‌ యోగా టీచర్
    • జాహ్నవి హారిసన్, బ్రిటిష్ సంగీత విద్వాంసురాలు
    • కెన్నెత్ లీ, యూనివర్సిటీ హాస్పిటల్, నెవార్క్, న్యూజెర్సీలో కమ్యూనిటీ హెల్త్ చాప్లిన్
    • ట్రావిస్ మిల్స్, ట్రావిస్ మిల్స్ ఆఫ్ఘనిస్తాన్‌లో అవయవాల దాత
    • జెఫ్రీ డి లాంగ్, ఎలిజబెత్‌టౌన్ కళాశాలలో అధ్యయనాల ప్రొఫెసర్
    • సీమా మోడీ, విదేశాంగ విధానం, వాల్ స్ట్రీట్‌పై దృష్టి సారించి CNBCకి గ్లోబల్ మార్కెట్ రిపోర్టర్.
    • జైన్ అషర్, సీఎన్‌ఎస్‌లో ప్రైమ్ టైమ్ న్యూస్ యాంకర్
    • రికీ కేజ్‌, మూడు సార్లు గ్రామీ అవార్డు
    • ఫల్గుణి షా, అమెరికన్ గాయకుడు
    • మేరీ మిల్‌బెన్, అమెరికన్ గాయని, నటి

    ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, అధికారులు, విద్యావేత్తలు, ఆరోగ్య నిపుణులు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమల ప్రముఖులు, మీడియా ప్రముఖులు, కళాకారులు, ఆధ్యాత్మిక నాయకులు, యోగా అభ్యాసకులు వంటి అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు, ప్రభావశీలులు కూడా హాజరవుతారు. యోగా డే కార్యక్రమంలో 180 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రజలు ప్రధానమంత్రితో చేరనున్నారు

  • 21 Jun 2023 04:53 PM (IST)

    యోగా గురించి ప్రజలకు తెలియజేయాలి

    అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. అలాగే ప్రముఖ దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ కూడా యోగి గురించి తెలియజేశారు. యోగా భారతదేశానికి చెందినదని, మనం దానిని మన దేశ ప్రజలకు నేర్పించాలని అన్నారు.

  • 21 Jun 2023 03:34 PM (IST)

    మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా: సీఎం

    కులం, మతం, మతం, సిద్ధాంతాలు ప్రభావితం కావని, మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగ సాధన చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

  • 21 Jun 2023 02:31 PM (IST)

    నౌకాదళ సిబ్బందితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యోగా

    అంతర్జాతీయ యోగాడేను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్యనారు. స్వదేశీ నిర్మిత విమాన వాహక నౌక ఐఎస్ఎస్‌ విక్రాంత్‌లో వందలాది మంది నౌకాదళ సిబ్బందితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యోగా వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, మన్‌సుఖ్ మాండవీయ, స్మృతి ఇరాని తదితరలు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.

  • 21 Jun 2023 12:44 PM (IST)

    జమ్మూలో..

    9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జ్మాములో యోగా చేశారు

  • 21 Jun 2023 12:42 PM (IST)

    కువైట్‌లో యోగా దినోత్సవ వేడుకలు

    కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి యోగా శిక్షకులు, ఔత్సాహికులు, దౌత్య దళ సభ్యులు, కువైట్‌లోని భారతీయులు హాజరయ్యారు.

  • 21 Jun 2023 12:02 PM (IST)

    కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి..

    దేశంలో స్ఫూర్తిదాయకంగా యోగా డే..యోగా ఫర్‌ వసుదైక కుటుంబం పేరుతో ధీమ్‌ యోగా డే కార్యక్రమాలు.. యోగా డే సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి యోగా చేశారు..గోవా గవర్నర్‌ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై అలాగే జీ 20 ప్రతినిధులతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు..యోగా డే సందర్భంగా దేశప్రజలంతా ఏకం అయ్యారు.కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు…సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు.. అంతా యోగా డే కార్యక్రమాల్లో పాల్గొన్నారు..

  • 21 Jun 2023 11:24 AM (IST)

    యోగా వేడుకల్లో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో యోగా చేశారు. ఉపాధ్యక్షుడు జగ్‌దీప్ ధంఖర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌తో కలిసి యోగా చేశారు.

  • 21 Jun 2023 11:03 AM (IST)

    ఈ ఏడాది యోగా థీమ్ ఏంటో తెలుసా..?

    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది వసుదైవ కుటుంబకం అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. భూమి అంతా ఒకటే.. అనేలా ఆరోగ్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక చింతన కోసం యోగా నిర్వహిస్తున్నారు.

  • 21 Jun 2023 10:42 AM (IST)

    కేంద్రమంత్రి నితిన్ గఢ్కరి

    కేంద్రమంత్రి నితిన్ గఢ్కరి నాగ్ పూర్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగా చేశారు.

  • 21 Jun 2023 09:51 AM (IST)

    స్పీకర్ ఓం బిర్లా..

    స్పీకర్ ఓం బిర్లా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని.. యోగా చేశారు.

  • 21 Jun 2023 09:50 AM (IST)

    పూణేలో..

    పూణేలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.

  • 21 Jun 2023 09:11 AM (IST)

    ఇదే భారత్ శక్తి.. పీయూష్ గోయల్..

    “ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలకు మన ప్రధాని నాయకత్వం వహిస్తారు, ఇది భారతదేశ శక్తిని సూచిస్తుంది, ప్రపంచ వేదికపై పెరుగుతున్న ఔచిత్యాన్ని సూచిస్తుంది” అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

  • 21 Jun 2023 08:30 AM (IST)

    ఐఎన్ఎస్ విక్రాంత్ లో రాజ్ నాథ్ సింగ్ యోగా

    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ విక్రాంత్ బోర్డులో యోగా చేశారు.

  • 21 Jun 2023 08:04 AM (IST)

    అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ..

    ధుబ్రిలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. పాల్గొని యోగా చేశారు.

  • 21 Jun 2023 07:57 AM (IST)

    బాలాసోర్ లో అశ్వనీ వైష్ణవ్..

    యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ బాలాసోర్ లో యోగా చేశారు.

  • 21 Jun 2023 07:10 AM (IST)

    యోగా ఆరోగ్యం: ప్రధాని మోడీ

    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా కార్యక్రమంలో పాల్గొంటానని ప్రధాని మోదీ తెలిపారు. యోగా సామూహిక ఉద్యమంగా మారిందని.. యోగా ద్వారా ప్రతిబంధకాలు, ప్రతిఘటనలు, వైరుధ్యాలను తొలగించవచ్చారు. యోగా ఆరోగ్యాన్ని, ఆయుష్షును, బలాన్ని ఇస్తుందని మోడీ తెలిపారు..

  • 21 Jun 2023 06:59 AM (IST)

    కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

    కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్ హమీర్పుర్ లో యోగా చేశారు.

  • 21 Jun 2023 06:55 AM (IST)

    హరిద్వార్‌లో యోగా సంబురాలు..

    9వ అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా గురు బాబా రామ్‌దేవ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి హరిద్వార్‌లో యోగా చేశారు.

  • 21 Jun 2023 06:51 AM (IST)

    ప్రత్యేక ఏర్పాట్లు..

    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ తో పాటు.. అన్ని దేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల కేంద్ర, ఆయా రాష్ట్రాల మంత్రుల ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరుగుతున్నాయి.

Published On - Jun 21,2023 6:46 AM