Friendship Day 2021: చెక్కు చెదరని బంధమే స్నేహం.. అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్‌ డే ఎలా వచ్చిందంటే..!

|

Aug 01, 2021 | 5:56 AM

Friendship Day 2021: ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న ప్రేమను వ్యక్తపర్చడానికి తమ మిత్రులతో గడుపుతారు. ఈ రోజు ఫ్రెండ్ షిప్‌ డే సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు...

Friendship Day 2021: చెక్కు చెదరని బంధమే స్నేహం.. అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్‌ డే ఎలా వచ్చిందంటే..!
Friendship Day 2021
Follow us on

Friendship Day 2021: ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న ప్రేమను వ్యక్తపర్చడానికి తమ మిత్రులతో గడుపుతారు. ఈ రోజు ఫ్రెండ్ షిప్‌ డే సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము. రక్తం పంచుకున్న తోబుట్టువులు.. జీవితాంతం తోడు ఉంటారో లేదోగానీ.. స్నేహితులు మాత్రం మన నీడలా మనవెంటే ఉంటారు. చిన్న ఆపద వచ్చినా ఆదుకుంటారు. నేనున్నానని ధైర్యం నింపుతారు. అందుకే.. వారిని ఏడాదిలో ఒక్కసారైనా స్మరించుకోవడం మన ధర్మం. అందుకే, ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్‌షిప్ డే’గా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ రోజునే స్నేహితుల దినోత్సవంగా ఎంపిక చేయడానికి.. అమెరికాలో జరిగిన ఓ విషాద ఘటనే కారణమని చెబుతారు. స్నేహమంటే భుజాల మీద చేతులు వేసి నడవడమే కాదు.. ఎన్ని కష్టాలు వచ్చినా ‘నీ వెనకే నేనున్నా’ అని భుజం తట్టడం… స్నేహితులు కుటుంబ సభ్యులు కాకపోయినా జీవితంలో మన ప్రతి ఆనందంలో వారి భాగస్వామ్యం తప్పక ఉంటుంది. సంతోషానిచ్చేదీ వారే… ప్రేమను పంచుకునేదీ వారే.. ఏదేమైనా మనతో అంటిపెట్టుకుని ఉండేవారే నిజమైన స్నేహితులు.

స్నేహం చాలా గొప్ప పదం. మనిషికి మాత్రమే దక్కిన ఒక భావోద్వేగ బంధం. కష్ట సమయంలో మనకు అండగా నిలబడే నిజమైన స్నేహితుడు. మంచి స్నేహానికి ఏ నియమాలూ వర్తించవు. అదో అందమైన అనుభవం. చిన్న చిన్న విషయాల్లో కూడా మనల్ని అభినందిస్తారు. కష్ట సమయంలో ఆదుకుంటారు. అండగా నిలబడతారు. ఎవరైతే మన జీవితంలో భాగమైనందుకు సంతోషపడుతున్నామో వారు కచ్చితంగా స్నేహితులే అయివుంటారు. రెండు వేర్వేరు శరీరాల్లో ఒకే మనసులాంటి వారు స్నేహితులు. ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఏమి ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు అంటూ ఏవి ఉండవు. అవసరమైనప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్ట సుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.

చ‌రిత్ర‌:

1935వ సంవత్సరం ఆగస్టు మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో చనిపోయిన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తర్వాత రోజైన ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌ క్రూసేడ్‌ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించగా, క్రమంగా చాలా దేశాలు దీన్ని పాటించడం మొదలు పెట్టాయి. దీంతో ఐక్యరాజ్యసమితి 2011లో ఆ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఇంగ్లీష్ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన ‘విన్నీ ది పూహ్‌’ కార్టూన్‌ క్యారెక్టర్‌ టెడ్డీబేర్‌ను స్నేహానికి ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ భార్య నానె అన్నన్‌ 1998లో ప్రకటించారు. అయితే భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్‌ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి.

ఇవీ కూడా చదవండి

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం.. ఆ బ్యాంకుకు రూ.5 కోట్ల జరిమానా విధింపు..!

Credit Score: మీరు క్రెడిట్‌ కార్డు.. రుణాలు తీసుకున్నారా..? మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపే అంశాలివే..!