Indonesia: ఇండోనేషియాలో మళ్ళీ పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించాయి. ఆదివారం ఉదయం హల్మహెరాకు ఉత్తరాన 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూఅంతర్భాగంలో 151 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం వలన ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు ఈరోజు ఉదయం 5.17 గంటలకు టోబెలోలో భూమి కంపించింది. భూకంప కేంద్రం టొబెలోకు 259 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.0గా నమోదయిందని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 174.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియల్సీ ఉందని పేర్కొంది. అయితే ఎటువంటి సునామీ హెచ్చరికలు లేవని తెలిపింది.
ఇక శనివారం మధ్యాహ్నం ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లోని అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు 40 మందికి పైగా గాయపడ్డారు. సమీపంలోని గ్రామాలు, నగరాల్లోని నివాసితులను ఖాళీ చేయించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రావిన్స్‌లోని లుమాజాంగ్ రీజెన్సీలోని సెమెరు పర్వతం వద్ద శనివారం మధ్యాహ్నం 3:20 గంటలకు విస్ఫోటనం సంభవించిందని సెంటర్ ఫర్ వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ తెలిపింది.
Also Read: ఈరోజు ఈ రాశివారికి స్త్రీవలన ధన లాభం ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..