America: అమెరికాలో నకిలీ క్యాన్సర్ మందులు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన సంజయ్.. నేరం రుజువైతే ఏళ్ల జైలుశిక్ష?

|

Jul 26, 2024 | 3:31 PM

సంజయ్ కుమార్ వేల డాలర్ల విలువైన నకిలీ ఔషధాలను అమెరికాకు విక్రయించినట్లు.. నకిలీ మందులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో దాఖలు చేసిన కేసు ప్రకారం.. సంజయ్ .. అతని భాగస్వామి కీత్రుడాతో సహా క్యాన్సర్ కి ఉపయోగించే నకిలీ మందులను విక్రయించినట్లు.. అమెరికాకు సులభంగా అక్రమంగా రవాణా చేసినట్లు కోర్టు వెల్లడించింది. కీత్రుడా అనేది క్యాన్సర్ ఇమ్యునోథెరపీ.. దీనిని USలో కొన్ని రకాల మెలనోమా, ఊపిరితిత్తుల క్యాన్సర్, తల , మెడ క్యాన్సర్, హాడ్కిన్ లింఫోమా, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్‌లకు చికిత్స చేయడంతో సహా 19 రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు

America: అమెరికాలో నకిలీ క్యాన్సర్ మందులు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన సంజయ్.. నేరం రుజువైతే ఏళ్ల జైలుశిక్ష?
Bihar Man Arrested In Us
Follow us on

డబ్బుల మీద ఆశతో మనిషి ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. ప్రాణాలను పోసే మందులను నకిలీగా తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. అలా నకిలీ క్యాన్సర్ మందులను విక్రయిస్తూ, అక్రమంగా తరలిస్తున్న బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి అగ్రరాజ్యం అమెరికాలో పట్టుబడ్డాడు. సంజయ్ కుమార్ వేల డాలర్ల విలువైన నకిలీ ఔషధాలను అమెరికాకు విక్రయించినట్లు.. నకిలీ మందులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో దాఖలు చేసిన కేసు ప్రకారం.. సంజయ్ .. అతని భాగస్వామి కీత్రుడాతో సహా క్యాన్సర్ కి ఉపయోగించే నకిలీ మందులను విక్రయించినట్లు.. అమెరికాకు సులభంగా అక్రమంగా రవాణా చేసినట్లు కోర్టు వెల్లడించింది.

కీత్రుడా అనేది క్యాన్సర్ ఇమ్యునోథెరపీ.. దీనిని USలో కొన్ని రకాల మెలనోమా, ఊపిరితిత్తుల క్యాన్సర్, తల , మెడ క్యాన్సర్, హాడ్కిన్ లింఫోమా, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్‌లకు చికిత్స చేయడంతో సహా 19 రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. దీని తయారీ, పంపిణీ కేవలం మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే LLC ద్వారా మాత్రమే చేయబడుతుంది. అమెరికాలో, Merck Sharp అండ్ Dohme LLC తప్ప ఎవరికీ దీన్ని విక్రయించడానికి లేదా తయారు చేయడానికి అనుమతి లేదు.

ఇవి కూడా చదవండి

జైలులో సంజయ్ కుమార్

సంజయ్‌ను జూన్ 26న హ్యూస్టన్‌లో అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని పట్టుకున్నప్పుడు.. అతను తన వ్యాపారాన్ని విస్తరించాలనే లక్ష్యంతో అమెరికాకు వచ్చాడని మీడియా కథనంలో పేర్కొంది. సంజయ్ కుమార్ రవాణా కోసం ఏర్పాట్లు చేశారని.. నాలుగు నకిలీ మందులను స్మగ్లింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరం రుజువైతే ప్రతి నేరానికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 43 ఏళ్ల సంజయ్‌పై ఆరోపణలు రుజువైతే.. 20 ఏళ్ల తర్వాతే భారత్‌కు తిరిగి రాగలడు. ఈ మొత్తం వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు.

భారతదేశంలో జోరుగా నకిలీ మందుల వ్యాపారం

భారతదేశంలో కూడా ఇలాంటి ఉదంతాలు చాలా వెలుగులోకి వచ్చాయి. గత నెల మార్చిలోనే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో నకిలీ క్యాన్సర్ మందులపై ఈడీ, క్రైమ్ బ్రాంచ్‌లు పలు చోట్ల దాడులు చేశాయి. ఇందులో దాదాపు 10 మందిని అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం ఈ దాడులలో పట్టుబడిన నిందితులు ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లోని ఆంకాలజీ విభాగాలలో పని చేస్తున్నారు. రోగులకు నకిలీ మందులను విక్రయిస్తున్నారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..