US Green Card: గ్రీన్ కార్డు ఇండియన్స్‌కు అందని ద్రాక్షే.! ఆశగా ఎదురుచూపులే..

| Edited By: Ravi Kiran

Mar 07, 2024 | 10:28 AM

గ్రీన్ కార్డ్. ఒకరు ఇద్దరు కాదు.. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లే ప్రతీ ఒక్కరి కల. కానీ ఈ డ్రీమ్ మాత్రం కొద్దిమందికే నెరవేరుతుంది. అయినా.. గ్రీన్ కార్డ్ లను ఎందుకు అంత తక్కువగా ఇస్తున్నారు?

US Green Card: గ్రీన్ కార్డు ఇండియన్స్‌కు అందని ద్రాక్షే.! ఆశగా ఎదురుచూపులే..
Maxresdefault
Follow us on

గ్రీన్ కార్డ్. ఒకరు ఇద్దరు కాదు.. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లే ప్రతీ ఒక్కరి కల. కానీ ఈ డ్రీమ్ మాత్రం కొద్దిమందికే నెరవేరుతుంది. అయినా.. గ్రీన్ కార్డ్ లను ఎందుకు అంత తక్కువగా ఇస్తున్నారు? అందులోనూ మన కన్నా వేరే దేశాలకు ఎందుకు ఎక్కువగా కేటాయిస్తున్నారు. అమెరికాకు మనం వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నాం. పైగా అక్కడి టెక్ పరిశ్రమలన్నీ మన నిపుణులపై భారీగానే ఆధారపడి ఉన్నాయి. ఇతర రంగాల్లోనూ మనవాళ్లు అందిస్తున్న సేవలు కూడా తక్కువేమీ కాదు. అలాంటప్పుడు అమెరికా మాత్రం మన వాళ్లకు గ్రీన్ కార్డ్ ఇవ్వడంలో ఎందుకు పెద్ద మనసు చేసుకోవడం లేదు? ఇప్పుడు ఇస్తున్న గ్రీన్ కార్డుల సంఖ్యను దాదాపు డబుల్ చేయాలన్న డిమాండ్ అక్కడ ఉన్నా.. ఎందుకు అది కార్యరూపం దాల్చడం లేదు? ఇలా చెబుతూ పోతే లెక్కలేనన్ని ప్రశ్నలు వస్తాయి. కానీ వీటిలో చాలా వాటికి ఎందుకు జవాబులు దొరకడం లేదు?

అమెరికా గ్రీన్ కార్డ్ కావాలని చాలా మంది కోరుకుంటారు. దీని వెనుక అసలు కారణం.. ఈ కార్డు వస్తేనే అమెరికా పౌరసత్వం తీసుకోవడం సాధ్యమవుతుంది. గ్రీన్ కార్డ్ వల్ల అమెరికాలో శాశ్వత నివాస హోదా దక్కుతుంది. ఆ తరువాత సిటిజన్ షిప్ కు మార్గం సుగుమం అవుతుంది. కానీ ఇప్పటికీ మన దగ్గరి నుంచి వెళ్లినవారితోపాటు వివిధ దేశాల నుంచి వెళ్లినవారిలో చాలామందికి ఈ గ్రీన్ కార్డ్ అందని మావిపండుగానే మిగిలిపోతోంది. నిజానికి గ్రీన్ కార్డ్ కోసం మనవాళ్లు భారీగానే దరఖాస్తులు పెడతారు. కానీ అవి మాత్రం కొద్దిమందికే దక్కుతున్నాయి. గ్రీన్ కార్డ్ ఉంటే కలిగే ప్రయోజనాల వల్లే ఎక్కువమంది దానిని కోరుకుంటారు. ఒక్కసారి ఈ కార్డ్ వస్తే.. అగ్రరాజ్యంలో శాశ్వత నివాస హోదా దక్కుతుంది. ఈ కార్డ్ ఉంటే జాబ్ మారినా ఇబ్బంది ఉండదు. బిజినెస్ లు చేసుకోవడానికి సమస్య రాదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది.. ఈ కార్డ్ వచ్చిన ఐదేళ్లలోపే అమెరికా సిటిజన్ షిప్ వచ్చే ఛాన్స్ ఉండడం. అందుకే ఎక్కువమంది దీనికి మొగ్గు చూపిస్తున్నారు. ఒకసారి పౌరసత్వం వస్తే చాలు.. తన కుటుంబ సభ్యుల కోసం గ్రీన్ కార్డుకు అప్లై చేయవచ్చు. దీనివల్ల కుటుంబం మొత్తం అక్కడే స్థిరపడడానికి అవకాశం లభిస్తుంది.