
సూడాన్‌లో కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో… సూడాన్‌లోని రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మిలీషియా సభ్యులు తాజాగా ఒక భారతీయుడిని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్‌నకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఖార్టూమ్ (సూడాన్) లో భారత పౌరుడు ఆదర్శ్ బేహెరా కిడ్నప్ కి గురి అయ్యారు . ఆదర్శ్ ఒడిశా రాష్ట్రంలోని జగత్సింగ్‌పూర్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల బేహెరా.. సూడాన్‌లోని రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మిలీషియా కిడ్నాప్ చేసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. 2023 నుండి సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF), రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి.
బేహెరా 2022 నుండి అల్ ఫషీర్ (ఉత్తర దార్ఫూర్) నగరంలోని సుకరటి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఇది ఖార్టూమ్ నుంచి దాదాపు 1,000 కి.మీ దూరంలో ఉంది. ఆయనను కిడ్నప్ చేసిన తరువాత న్యాలా నగరానికి తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. న్యాలా దక్షిణ దార్ఫూర్ రాజధాని . RSF బలగాల ప్రధాన స్థావరం కూడా ఇక్కడే ఉంది.. తన కుటుంబానికి పంపిన వీడియోలో బేహెరా చేతులు ముడుచుకొని సహాయం కోరుతూ కనిపించారు. ఇద్దరు మిలీషియా సభ్యుల మధ్య ఆదర్శ్ కూర్చుని ఉండగా.. వారిలో ఒకరు ‘మీకు షారుఖ్ ఖాన్ తెలుసా?’ అని అతన్ని అడుగుతున్నాడు.
An Indian national, Adarsh Behera from Odisha was kidnapped by Rapid Support Forces militiamen.#sudan pic.twitter.com/9xRIW6VZVp
— World Monitor 🪩 (@WorldMonitor247) November 3, 2025
అందులో ఆయన, నేను అల్ ఫషీర్‌లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను రెండు సంవత్సరాలుగా చాలా కష్టంగా జీవిస్తున్నాను. నా కుటుంబం, పిల్లలు చాలా ఆందోళనగా ఉన్నారు.. ఒడిశా ప్రభుత్వం సాయం చేయాలంటూ బెహరా చెప్పినట్టు .. బేహెరా భార్య సుస్మిత బేహెరా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరికి 8 మరొకరికి 3 సంవత్సరాలు ఉన్నాయని.. తన భర్తకు ఏదైనా జరుగుతుందేమోనన్న భయం వెంటాడుతుందని చెప్పారు.
🇸🇩🇮🇳 Sudan–India: RSF militants have abducted Adarsh Behera (36), an Indian from Odisha, forcing him to perform “Namaste” and other humiliating acts while laughing at him like a circus clown. His whereabouts are still unknown. pic.twitter.com/fk7uezqCW0
— Militant Tracker (@MilitantTracker) November 4, 2025
ప్రస్తుతం అల్ ఫషీర్‌లో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. సూడాన్‌లో కొనసాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటివరకు 1.3 కోట్లకుపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దార్ఫూర్ ప్రాంతంలో హత్యలు, అత్యాచారాలు చోటుచేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
బేహెరాను కిడ్నాపర్ ల చెర నుంచి విడిపించి.. క్షేమంగా ఇండియా కు తీసుకొని రావాలని ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..